పుట:2015.373190.Athma-Charitramu.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 392

నాభార్యకోక యొకటి యామెకుఁ గట్టనిచ్చితిని. నీటిగండము తప్పిన యాదీనకు శరణ మొసంగినందుకు నన్ను మిత్రు లభినందించిరి. అంత నింటి తలుపు తాళము వేసికొని, మిత్రుఁడు ముద్రాలయమునకును, నేను బాఠశాలకును వెడలిపోయితిమి.

ఆ సాయంకాలమున నేలూరు రెయిలు దిగివచ్చిన నాభార్య చూచుసరికి, మాయింటివాక్లిట పరస్త్రీయొకతె మసలుచుండుటయు, ఆమె తనచీరయే సింగారించుకొని యుండుటయును, ఆ గృహిణికి వెఱ్ఱి యనుమానములు గలిపించెనఁట ! కొంతసేపటికి నేను రావుగారు నిలుసేరి, ఆస్త్రీ బంధువులకు వర్తమాన మంపితిమి. ఆ యువతి పుట్టినిల్లు రాజమంద్రి యనియు, ప్రవర్తనము మంచిది కాదనియు, భర్తతోఁ బోరాడి యానాఁడు పాఱిపోయివచ్చె ననియును వారు మాకుఁ జెప్పి, ఆమె నెట్లో భర్తృగృహముఁ జేర్చిరి.

7 వ సెప్టెంబరున ఆదిపూడి సోమనాధరావుగారు బెజవాడ వచ్చి మాయింట నొకవారము నిలిచియుండిరి. ఆపురమందు కొన్ని హరికథలును, ప్రసంగములును వారు గావించిరి. సోమనాధరావుగారి యుపన్యాసములు జనరంజకములుగ నుండెను. ప్రేక్షకులు వచ్చినను రాకున్నను నియమితసమయమునకె సరిగాఁ దమప్రసంగమును ప్రారంభించి, ఒకగంట మాటాడి యాయన కూర్చుందురు ! ఈ కట్టుఁబాటువలన సభ్యులు సమయమునకే వచ్చి యాసక్తితో వినుచుండువారు. ఆయన హరికథలు, క్రొత్తపద్ధతి ననుసరించి, సంస్కారమునకు సుముఖములుగనుండి, ప్రేక్షకుల కమిత ప్రమోదమును గొలుపుచుండెడివి.

ఆరోజులలో నాకు గుండెదగ్గఱ మండుచుండెడిది. మిత్రులు డాక్టరు వెంకటసుబ్బయ్యగారు నాహృదయము శ్వాసకోశములును