పుట:2015.373190.Athma-Charitramu.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38. "బాల్యస్వర్గము" 375

నిదర్శనములు. ఈరెండు నిదివఱకే సూచింపఁబడినవి. కావున వానిలోని మొదటిదగు "బాల్యస్వర్గము" అను వ్యాసమందలి ముఖ్యాంశము లిందుఁ బొందుపఱచు చున్నాను : -

శిశువు మనుజుని జనకుఁ డని వశ్డుసువర్తకవి నుడివెను. యౌవనపుఁబోకడలు బాల్యముననె పొడఁగట్టును. పండుసూచనలు పూవులోనె కానవచ్చును. కారణముననె కార్య మిమిడియున్నది. తన వంశమునకు భావికాలమున రానున్న విపద్దశ తొలఁగించుకొనుటకై, జ్యేష్ఠపుత్రుఁడు దుర్యోధనుని బాల్యముననె తాను తెగటార్చవలయు నని, ధృతరాష్ట్రునికి మంత్రులు హితోపదేశము చేసిరి. బాలకులు వికాసమునొందని. చిన్నిమనుజులు.

ఐనను, 'చిన్ని మనుజులని' చిన్నవారిని చిన్నగాఁ జెప్ప వొప్పదు. ఆకాశమంత యాశయు, అభివృద్ధినొంద నపరిమితావకాశము నఖండమనశ్శక్తులును గల చిన్నవారలొ, హ్రస్వదృష్టియు సంకుచిత స్వభావము నేర్పడిన పెద్దవారలో, నిజమయిన చిన్న వారలని చదువరులె నిర్ధారణచేసికొనఁ గలరు. ఎన్నిలోపము లున్నను శైశవముతోనె నాకు సానుభూతి. పెద్దవారలతోడి స్వర్గమునకంటె చిన్న వారలతోడి నరకమె, నాకు వాంఛనీయము !

బాల్యసుఖములె నిశ్చితమైన సుఖములు ! - పిన్నవాని పిన్న నవ్వు గగనతలమందలి బాలచంద్రునిఁ దోఁపించును. ఒక కవి వర్ణించి నట్టుగ, మనుజుని కపోలతలమునఁ బొడసూపు నల్లనివెండ్రుకలు మొలక లెత్తు పాపబీజములను స్ఫురించును. దీనితో బాలకుని నిష్కపటమగు మోముదమ్మిని బోల్చి చూడుఁడు ! స్ఫటికమువలె స్వచ్ఛముగను, వికసించు మల్లియవలె పరువముతోను, అయ్యది యొప్పుచుండును. స్వర్గలోకసుఖముల నిది స్ఫురించుచుండును ! స్వాభావికముగ సుగుణ