పుట:2015.373190.Athma-Charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము

ప్రథమ భాగము : విద్యార్థిదశ

1. బాల్యము

నా బాల్యదినముల సంగతులు కొన్ని నాకు జ్ఞప్తియందుఁ గలవు. మా తండ్రితో మధ్యాహ్న భోజనమునకుఁ గూర్చుండునపుడు నాకు నచ్చిన విస్తరాకు సమకూరుట దుర్ఘటమగుచువచ్చెను. అరఁటితోఁటలకు ప్రఖ్యాతినొందిన ఖండవల్లిలోనే యిట్లు జరుగుచువచ్చెను ! అచట మా తండ్రి సర్వేయుద్యోగి, తోఁటలలోనుండి యరఁటాకుల కట్ట లెన్నియో యనుదినమును మా యింటికి వచ్చుచుండినను, ఏకట్ట విప్పినప్పుడును నా కంటికి సరిపడు మంచి యాకందు దొరకకుండెడిది. ఆకు చివర గాలితాఁకుడువలన సామాన్యముగఁ గించెము చినుఁగుచుండును. ఏమాత్రము చినిఁగినను, కుపితుఁడనై, ఆకును చేతులతో నులిమి పారవైతును ! ఉసులుమఱ్ఱుగ్రామములో జరిగిన యొకసంగతి నాకు జ్ఞాపకము. మా తండ్రి నాకొక రుమాలు కొనిపెట్టెను. అది బుజముమీఁద వేసికొని, నాకంటె పెద్దవాఁడగు నొక సావాసునితో చుట్టుపట్టుల కేగుచుండువాఁడను. బాజాలు చూపింతు నని శుభకార్యములు జరుగుచోట్లకు నన్నాతఁడు కొని