పుట:2015.373190.Athma-Charitramu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. పెండ్లిబేరములు 315

వెంకటసుబ్బయ్యగారు వచ్చి మందిచ్చిరి. భార్యను బంపుఁ డని నేను రాజమంద్రి తంతి యిచ్చితిని. తంత్రీసమాచారము విని మానాయన దు:ఖపరవశుఁడై, నన్ను గుఱించి వివరములు వ్రాయనందుకు సీతాపతి మీఁద కోపపడెనఁట. ఒకటి రెండురోజులలో నాఁడువాండ్రు బెజవాడకు వచ్చిరి.

ఈ కడుపునొప్పి నెమ్మదిపడిన కొన్ని దినములవఱకును నాకు నిస్సత్తువుగ నుండెను. కావుననే కాకినాడలో జరిగిన "ఆస్తికసమావేశము"నకు నేను వెళ్ల లేకపోయితిని. అచటికిఁబోయి 11 వ తేదీని తిరిగివచ్చిన వీరభద్రరావుగారు సభాసమాచారములు కొనివచ్చెను. మఱుసటిసంవత్సరసభ బెజవాడలో జరుపుటకు తీర్మానించిరి.

ఆ సంవత్సరమున బెజవాడపాఠశాలకు క్లార్కుదొరయే వ్యవహారకర్తగ నుండినట్లు కనఁబడుచున్నది. 11 వ ఏప్రిలు తేదీని పాఠశాలలో జరిగిన యుపాధ్యాయులసభలో, ప్రతి యుపాధ్యాయునిపనియు నెక్కువ చేయవలె నని క్లార్కుదొరయానతి యయ్యెనని ప్రకటింపఁబడెను.

14 వ ఏప్రిలు తేదీని నాకు తమ్ముఁడు కృష్ణయ్య వ్రాసిన జాబులో, ఆనెలలోనే తన ద్వితీయవివాహము చేయవలె నని మాతలిదండ్రులు సంకల్పించి, మంచి వరదక్షిణకొఱకుఁ బ్రయత్నించుచుండిరని యుండెను ! నామాట మావాండ్రు ధిక్కరించి రనియు, ఇట్టి యకృత్యములవలన కుటుంబమున కపకీర్తి వాటిల్లు ననియును, నేను మిగుల వగచితిని.

17 వ ఏప్రిలు తేదీని నాదినచర్య పుస్తకమునం దిట్లున్నది : - "బార్యసానుభూతి లేనికారణమున బ్రాహ్మమతస్వీకారము చేయవలె