పుట:2015.373190.Athma-Charitramu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. "చిప్పల శివరాత్రి" 311

నా తమ్ముఁడు సూర్యనారాయణ లోవరుసెకండరీపరీక్షలో విజయమంది విజయవాడలోఁ జదువుటకై జనవరి 29 వ తేదీని వచ్చెను. బావమఱఁది సీతాపతియు నిక్కడఁ జదువఁగోరుచున్నాఁడు కాని, తలిదండ్రు లాతనిజీతమైన నీయఁజాల రని చిన్నతమ్ముఁడు చెప్పెను. నే నా నాహ్వానింపఁగా సీతాపతి 5 వ ఫిబ్రవరి బెజవాడ వచ్చెను. కృష్ణయ్యభార్యకు మిక్కిలి జబ్బుగా నుండెనను వార్త నాతఁడు గొనివచ్చెను. మాపాఠశాలలో నీసంవత్సరము ఐదుగురు ప్రవేశపరీక్ష యందు జయ మందుటకు మేమందఱము సంతసించితిమి.

వీరభద్రరావుగా రిచటికిఁ గొనివచ్చెడి ముద్రాలయమున కొక్క వసతి గృహము సంవత్సరమునకు నూఱురూపాయిల బాడుగకుఁ గుదిర్చితిమి. కాని, 8 వ ఫిబ్రవరిని ఆయన ముద్రాలయమును బెజవాడకుఁ గొనిరాఁగా, అదివఱకు బస యిచ్చెద ననిన పెద్దమనుష్యుడు వెనుకకు తగ్గెను ! అంతఁ గొన్ని రోజులకు వేఱొకయిల్లు సమకూడెను. ఈ ముద్రాక్షరశాలకు పని సంపాదించుట కెంతయో ప్రయత్నించితిని. నా "జనానాపత్రిక"నింతటినుండి యీముద్రాలయముననే ప్రచురించుట కేర్పఱిచితిని.

న్యాయవాదిపరీక్ష నిచ్చి వెంకటరామయ్య ఫిబ్రవరి 11 వ తేదీని మద్రాసునుండి వచ్చెను. కుటుంబవ్యవహారములను గుఱించియు, అప్పులతీర్మానమును గూర్చియును మేము మాటాడుకొంటిమి. రేలంగి రాజమహేంద్రవరములలోఁగల మాయిండ్ల నమ్మివైచి, ఋణము నిశ్శేషము చేయవలెనని నాపట్టు. ఇది యిట్లుండఁగా, బెజవాడ గవర్నరుపేటలో వేయిగజముల స్థలములోఁ గట్టిన యొకయిల్లు 800 రూపాయలకు విక్రయమునకు వచ్చెను. అది కొనుటకు నే నభిలషించితిని. మిత్రుఁడు రాజారావు నడుగఁగా, ఆయింటి తాకటు