పుట:2015.373190.Athma-Charitramu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 270

మును వాహ్యాళి కేగుటయు, డంబెల్సుతో కసరతు చేయుటయును ముఖ్యసాధనము లని నాకుఁ దోఁచెను. విద్యావిషయమై నే నతిజాగ్రతతో నుండఁగోరి, రాత్రి పదిగంటల పిమ్మట చదువవలదనియు, తెల్లవాఱుజామున మూఁడు నాలుగుగంటలకు మెలఁకువ వచ్చెనా తిరిగి నిద్రింపక, చదువునకుఁ గాని ప్రార్థనవ్యాయామములకుఁ గాని గడంగవలె ననియు నియమముచేసికొన నుద్యమించితిని.

నా యాత్మోజ్జీవనవిషయమును విమర్శనఁ జేసికొనుచు నే నిట్లు వ్రాసితిని : - "గతసంవత్సరమునకంటె నే నిపుడు మంచి స్థితి నున్నాను గాని, యిపుడైనను భగవంతునికి హృదయపూర్వక ప్రార్థనలు చెల్లింపనేరకుండుట శోచనీయము గదా ! అనుదినప్రార్థన మభ్యాసము చేసికొని, కోపదు:ఖములు పొడసూపు నుద్రేక సమయములందును, విషయలాలసయందును, దైవమును స్ఫురణకుఁ దెచ్చుకొనుట వలన నాత్మోజ్జీవనము కలుగును. నీ సంభాషణాది యనుదినకార్యక్రమమునందె దైవభక్తి ప్రకటీకృత మగుచుండవలెను. శీలసౌష్ఠవ మొకటియే ప్రాణోత్క్రమణ సమయమందు నిన్నుఁ జేయి విడువని పరమమిత్రుఁ డని నమ్ముము ! ఉత్తమజనులస్నేహమును సముపార్జించి, నీరసుల సముద్ధరింపఁబూనుము. మిక్కిలి యోగ్యమగు పుస్తకములే చదువుచుండుము. సౌహార్దమె మానవులయం దేకీభావ మొనఁగూర్చు దివ్యమంత్ర మని నమ్ముము". ఇట్లు నేను మానసబోధముఁ గావించు కొంటిని.

గత సంవత్సరమున బెజవాడలో ప్రార్థనసమాజము నెలకొల్పితిమి. జనానాపత్రికను నడిపి, పాఠశాలలోని కార్యక్రమమును సరిగ జరిపితిని. ఈసంవత్సర మింకను ఈపనుల నెక్కువశ్రద్ధతో నాచరించుచు, జనోపయుక్తములగు నుపన్యాసము లిచ్చుచు, సంఘసంస్క