పుట:2015.373190.Athma-Charitramu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 250

నా కాపాఠశాలలోఁ బ్రియమిత్రులయిన యింకొక యుపాధ్యాయుని గుఱించి కూడ నిచటఁ జెప్పవలయును. వీరు ఆంధ్రపండితులగు జానపాటి కామశాస్త్రిగారు. ఇంచుమించుగ నాయీడువారే. నావలెనే బకింగుహాముపేటలోఁ గాపురము. సామాన్యముగ మే మిద్దఱమును గలసియే పాఠశాలకుఁ బోవుచు వచ్చుచుండెడివారము. ఉభయులము పాఠశాల యావరణమున సాయంకాలమున బంతు లాడు చుందుము. సామాన్యదేశభాషాపండితులవలెఁ గాక, కామశాస్త్రిగారు ఉన్నతయాంగ్లవిద్య నభ్యసించిన యధ్యాపకునివలె విద్యార్థులను మంచియదుపులో నుంచి, వారి గౌరవ లాలనములకుఁ బాత్రు లగు చుండువారు. తాను గొంతవఱకు పూర్వాచారపరుఁ డయ్యును, కాలానుగుణ్యముగ సంఘమున కావశ్యకమైన కొన్ని సంస్కరణముల నీయన యామోదించుచుండువాఁడు.

తఱచుగ నాంధ్రవ్యాసములు రచించుచును మాసపత్రిక నొకటి ప్రకటించుచును నుండునాకు, వీరిసాయము నిరతమును గావలసి వచ్చెడిది. సరసులు, సాధుపుంగవులు, స్నేహపాత్రులును నగు శాస్త్రిగారు విసు వనుమాట నెఱుంగక, నావ్రాఁతలు దిద్దిపెట్టుచు నిరుపమాన స్త్రీవిద్యాభిమానమున నొప్పుచుండువారు.

నా కీ కాలమున పాఠశాలలోని బోధకులే గాక విద్యార్థులును గొందఱు స్నేహితులైరి. విగ్రహారాధనమును గుఱించి తనకుఁ గల స్వతంత్రాభిప్రాయములకొఱకు, సహచరుల యెత్తిపొడుపులకు గుఱియై నాయాదరము వడయుచుండిన అనంతరామయ్యను గుఱించి యిదివఱకే చెప్పితిని. మానికొండ రాజారావు, టేకుమళ్ల రాజగోపాలరావుగార్లు, తక్కినవారిలో ముఖ్యులు. మొదటి యాతఁ డానగరనివాసి. నేను షికారు పోవునపుడు ఆతఁడు నన్ను వెంబ