పుట:2015.373190.Athma-Charitramu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. వేసవిసెలవులు 227

కాని, క్రొత్తస్నేహితులు నాకు లభించుకొలఁది, ప్రాఁతవారి తోడినేస్తము విడివడుచుండెను! సమాజ సత్యసంవర్థనుల గుఱించి యిటీవలప్రబలిన గడిబిడ యేమని నేను వ్రాయఁగా, కనకరాజు పాలకొల్లు నుండి ప్రత్యుత్తరమిచ్చెను. ఆతనిమనస్సు లేఖలో ధారాళముగ ప్రతిబింబత మయ్యెను. ఆతనియెడ నేను వైరభావమూని నిరంకుశాధికారము సల్పుచుంటిననియు, మిత్రు లారోపించెడి లోపము లన్నియు నాయందుఁ గలవనియు, నాతని యభిప్రాయము ! మాతమ్మునిదెసఁ గూడ నీతనికి వైరస్యమే. మే మిరువురమును సత్యసంవర్థని కధ్వర్యము వదలుకొని, మృత్యుంజయరావున కాపదవి కట్టఁబెట్టి, పత్రికా విలేఖకులముగ మాత్ర ముండినచో, తానును బత్రికకు వ్రాయుచుందునని యాతఁడు చెప్పివేసెను! ఈమిత్రునివైఖరి చూచి నాకు వెఱ్ఱికోపము వచ్చెను. నిజముగా నా వర్తనమునం దీపెద్ద లోపము లుండెనా ? ఇపుడు నన్నుగుఱించి మొఱపెట్టుటలో మిత్రులు సద్భావమున మెలంగిరా ? నేను మిగుల విలపించి నిరుత్సాహమందితిని. నేను మిత్రులనుకొనినంత దోషిని గాననియు, ఈవిషయమున వారైన నిర్దోషులు గారనియు, నా నిశ్చయాభిప్రాయము! స్నేహితుల సోదరప్రేమ మిట్లు కోలుపోయిన నాకు, సోదరుని స్నేహ ప్రేమములు పెంపొందఁ జొచ్చెను.

నే నీకాలమున ప్లేటో విరచితమగు "ప్రజాస్వామికత్వము"ను పఠించితిని. బహుదేవతారాధనాది మతోన్మాదములను నిరసించిన ప్లేటో, 19 వ శతాబ్దమందలి యాస్తికునివలె గనఁబడెను. ఐనను స్త్రీసామాన్యతా సిద్ధాంతమును సమర్థించిన ప్లేటో మొఱకుమానిసి వలెఁ గన్పించెను. ఇందుఁ బ్రతిఫలితమగు సోక్రటీసుని యాకార