పుట:2015.373190.Athma-Charitramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మద్రాసు, పర్లాకిమిడి, విజయనగరము, గుంటూరు, నెల్లూరుపురములందు విద్యాబోధకవృత్తియందు వారు చేసిన పరిశ్రమ ఆంధ్రావనియం దంతటను వారి శిష్య ప్రశిష్యుల జీవితములయందు ప్రత్యక్ష మగుచున్నది. వేంకటశివుడుగారి సుబోధకత్వము విద్యాబోధకవృత్తి యందే కాక వారివ్యాసములయందును, రచనముల యందును, దిన చర్యల యందును, మతానుష్ఠానమునందును, జీవియాత్రయందును, జీవితపరమార్థమైన ఆత్మచరిత్ర మందును గోచరం బగుచున్నది.

ఆత్మచరిత్రను సింహావలోకనము చేయునపుడు, వేంకటశివుడుగారు వారి జీవయాత్రను నిత్యమైన ఆత్మయాత్రను చేయుటకు చేసిన సంతతపరిశ్రమము పొడగట్టుచున్నది. జీవయాత్రను సంకుచితమైన ఆచారావరణమునుండి విశాలమైన ధర్మావరణమునందు ప్రవహింపజేయుటకు విశ్వ మనుభవించిన దు:ఖవేదనను విశ్వజీవయాత్ర యనంతముఖములను బోధించుచున్నది.

"కాలు కదపక, కలము సాగింపక, మనస్సు పరిశ్రమింపక యుండు నిర్భంధవిపరీతవిశ్రమ మెవరికైనా శాంతి సౌఖ్యము లొనఁ గూర్చినఁ గూర్చుఁగాక. నాకుమాత్ర మది కేవలదుర్భర దుస్థితియే!"

ఆచారావరణమునందు సంకుచితమైన జీవయాత్రను జ్ఞానావరణమునందు విశాలముచేయుట జీవ