పుట:2015.373190.Athma-Charitramu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41. వైరివర్గము 179

"సత్యాన్వేషిణి" వ్రాఁతలలోని వంకరలను, వేశ్యాజనాభిమానము, పూర్వాచార పరాయణత్వము, స్మార్తకర్మలు, స్త్రీ గౌరవము, సత్యము, అను శీర్షికలతో పంతులుగారు ఖండించివైచిరి. ఇంతటితోఁ దనివి చెందక, పంతులు హిందూ మతోన్మాదములను, దురాచారములను సమర్థింపఁజూచెడి పండితాభాసులవాదనలను చర్యలను గర్హించుచు, ఆగస్టు నెలనుండియే ప్రహసనములు వ్రాయఁజొచ్చెను. ఆనెలలోఁ బ్రచురింపఁబడిన "హిందూమతసభ" వీరి ప్రహసనములలో నెల్ల కఱకుఁదనమునకుఁ బ్రసిద్ధి కెక్కియున్న వానిలో నొకటి. అది చదివి వినోదించుటకై యనేకు లాపత్రిక సంచికలను గొనిరి. ఇట్టి ప్రహసనము లుండుటవలన "సత్యసంవర్థని" జనరంజక మగు చుండుట విని, పంతులుగారు అప్పటినుండియు కొంతకాలము పత్రిక కొక్కొక చిన్నప్రహసనము వ్రాయఁజొచ్చిరి. ఇట్లీ సమయమున మాపత్రికలో పంతులుగారు వ్రాసిన ప్రహసనములలో "యోగాభ్యాసము," "కలిపురుషశనైశ్చర విలాసము"ను ముఖ్యములు.

ఆ నవంబరునెల తుదివారములో, రాజమంద్రికి కోటయ్య సెట్టిగా రను దివ్యజ్ఞానసమాజోద్యోగి యొకరు వచ్చి, అక్కడ కొన్ని యుపన్యాసము లిచ్చి, విద్యార్థులతో సంభాషణములు జరిపిరి. మిత్రులతోఁ గూడి నే నాసభకుఁ బోయి, సెట్టిగారి యభిప్రాయములను గ్రహించి, వానిని గుఱించి విపులమగు విమర్శనము ఆంగ్లమున వ్రాసి మాపత్రిక నవంబరు డిసెంబరు సంచికలలోఁ బ్రచురించితిని. ప్రకృతమున "దివ్యజ్ఞాన సమాజము" వారు సంఘసంస్కారమునకు సుముఖులుగ నున్నను, ఆకాలమున వారు హిందూమతమును, హిందూసాంఘికాచారములను ఆమూలాగ్రముగ సమర్థించుటయె తమ ధర్మమని విశ్వసించెడివారు ! కావున సంఘ సంస్కారములకును, దివ్యజ్ఞాన సామా