పుట:2015.373190.Athma-Charitramu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38. సంరంభము 167

యమై యిపుడు గట్టిగఁ దలపోయసాగితిమి. ఈ సంవత్సరము పట్ట పరీక్ష పూర్తిచేసి, బోధనాభ్యసనమునకై రాఁబోవువత్సరము తాను సైదాపేటకుఁ బోయెదనని మృత్యుంజయరావు చెప్పెను. నేనును పాఠశాలలోఁ బనిచేయ నిశ్చయించి, నరసింహరాయఁడుగారిని గూడఁ జేరున ట్లొప్పించితిని. కనకరాజు కూడ చేరెద ననెను.

సమాజప్రార్థనలతోఁ దనివి నొందక, నిత్యకుటుంబప్రార్థనలు జరుపుట కర్తవ్యమని వీరేశలింగముపంతులుగారు మాకు హితబోధనము చేసిరి. తమరు వారమువారమును జరుపు ప్రార్థనసభలకు నాతల్లిని భార్యను బంపు మని రాజ్యలక్ష్మమ్మగారు నన్నడిగిరి. లక్ష్మీనారాయణగారు నేనును మాటాడుకొనుచు, స్నేహితులసతీమణు లందఱు నొకచోట సమావేశమై చదువు సాగించుకొనుట యుక్తమని భావించితిమి. కాని, సమష్టికుటుంబములలో కూరుకొనిపోయెడి చిన్న కోడండ్రు ధైర్యమున బయటపడి, తమచదువు సాగించుటకుఁ గాని, ప్రార్థనసభలు జరుపుటకుఁగాని యెట్లు సాధ్య మగును?

లక్ష్మీనారాయణగా రిపుడు ప్రార్థనసమాజాదర్శములనుగుఱించి యెక్కువ సానుభూతిఁ జూపుచుండెడివారు. అపుడే జరిగిన యొక బోగముమేళమునుగుఱించి యాయన యొక పెద్దజాబు వ్రాసి, అది మాపత్రికలోఁ బ్రచురింపఁగోరెను. అంత పెద్దలేఖకుఁ దావు లేనందున, అది సంగ్రహవార్తగ ఫిబ్రవరిపత్రికలోఁ బ్రచురింపఁబడెను. ఆకాలమున మిత్రులలోఁ గలవరమునకుఁ గారణ మయ్యెను గావున, దాని నిచట నుల్లేఖించుచున్నాను. కనకరాజుయొక్క కటుపద ప్రయోగములతోఁ గూడిన దిద్దుఁబాటు లిందుఁ గానఁబడగలవు : -y

"కడచిన మకరసంక్రాంతినాఁడు, మన పట్టణములో పట్ట పరీక్షయందు తేరినవారు కొందరును, ఆపరీక్షకు పోదలచినవారు