పుట:2015.373190.Athma-Charitramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్సాహ మభిమానావృతమయ్యును జీవితపరిణామమునకు సాధనభూత మగుచున్నది. వేంకటశివుడుగారు విద్యార్థి దశయందు నిర్వహించిన సత్యసంవర్ధనీపత్రిక, ప్రార్థనాసమాజము, సాహిత్యరచనలు, విద్యావ్యాసంగము మొదలగునవి వారి భావిజీవితపరిణామమునకు నిదర్శనములు. వేంకటశివుడుగారు యథార్థమైన విద్యార్థులైన విధమును వారి సంతతవిద్యావ్యాసంగము, ఆత్మజిజ్ఞాస, దైవభక్తి, సంస్కారప్రియత్వమును విశదము చేయుచున్నవి. విద్యారంగమునందలి యభ్యాసాదర్శములు విశ్వరంగమునందు సఫలముగా గల విధమున కాత్మచరిత్రలు ప్రమాణములు.

విశ్వరంగము : - గృహరంగమునం దభ్యస్తములైన ప్రేమభక్తులు, విద్యారంగమునందు సముపార్జితమైన కళాజ్ఞానమును విశ్వరంగమునందు యోగరూపమున నాత్మోపలబ్ధికి వినియోగపడుచున్నవి. సాంఖ్యము వృత్తిసాధనమున యోగరూపమును దాల్చు చున్నది. జీవయాత్రయందు వృత్తులందు భేదము లున్నను, ధర్మలక్ష్యమునందు భేదము లేదు. ధర్మార్థకామమోక్షములను సమకూర్చుటకు స్వధర్మనిర్వహణము ప్రమాణము కాని, వృత్తులు ప్రమాణములు కావు. ఆత్మచరిత్ర యీ పరమార్థము ననేకసందర్భములయందు బోధించుచున్నది.