పుట:2015.373190.Athma-Charitramu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 150

గాంచి, పరిపూర్ణ సంస్కరణామోదినియై విలసిల్లవలె నని యాతని వాంఛ !

ఇప్పుడు, గృహస్థాశ్రమప్రథమరంగముననే, తనసతి విద్యారహితత్వసంస్కారవిముఖత్వములు, ఆతనినయనములకు ప్రదర్శితము లయ్యెను ! ముందైన నాయువిదకు విద్యాసంస్కరణామోదము రుచించు నవకాశము చేకూరునట్ట దోఁపకుండెను. ఆతఁడు నెమ్మదియు నిదానమునుగల కార్యవాది యై యుండెనేని, ప్రకృతమున సతికి విద్యాబోధనము చేయుటతోనె సంతృప్తి నొంది, తాను స్వతంత్రుఁడై తనపరిస్థితులు సుముఖమైనపుడు, సంస్కరణాంకుర మామెహృదయమున నాటఁజూచియుండును. కాని, యాతనిసంస్కరణావేశము మె ట్లెక్కకయె మేడఁ జేరఁగోరెను ! ఆతనివేగిరపాటు, నాందీముఖముననే, నాటకాంత్యరంగసందర్శనముఁ జేయఁగోరెను ! భర్తకు భార్య యర్ధాంగియు సహధర్మచారిణియును గావున, సంస్కరణమే జీవితవ్రతమైన పతికి, సంసారయాత్రయందు సతి చేయూఁతయై నిలువ నిశ్చయింపవలయును; లేదా, గృహస్థాశ్రమారంభమే, ఏతదాశ్రమవిచ్ఛేదకదశాప్రారంభ మని యాగృహిణి పరిగణింప వలయును !

ఇట్టి కఠినసమస్య నెదుర్కొన నెవరు వెఱవరు ? కాని, యెంతటిచిక్కునైనను నైసర్గిక సౌశీల్యప్రభావమున స్త్రీ యవలీలగ విడఁదీయ నేర్చును. ఫతి కభిమతమగు సంస్కరణామార్గము తనకును సమ్మత మని యా కలికి పలికి, తనసౌజన్య కార్యసాధకనై పుణ్యములను వ్యక్తీకరించెను !

నేర్పుటకంటె మాన్పుట కష్టతరము. ఆకాలమున పామరజనులు, విద్యాధికులకును, సంఘసంస్కారులకును, ఆరోపింపని యవగుణ మేది