పుట:2015.373190.Athma-Charitramu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౩౨. పత్రికాస్థాపనము

సత్యసంవర్థనిని తమపత్రికఁగా ప్రార్థనసమాజము అంగీకరించుట యావశ్యకము గాన, ౫-వ తేదీని సమాజప్రత్యేకసభ నొకటిఁ గూర్చితిమి. సమాజపునరుద్ధరణము జరిగినపిదప, పత్రికాప్రచురణమున కందఱు నొప్పుకొనిరి. ఎవరికిఁ దోఁచినచందాలు వారు వేసిరి. అంతట సమాజము చేసికొనిన తీర్మానములచొప్పున, పత్రికానిర్వహణకార్యము మాలో నైదుగురు సభ్యుల కొప్పగింపఁబడెను. వీరిలో శ్రీరాములుగారు పత్రికావిలేఖకులు నిర్వహకులును; నేను ప్రచురణ కర్తను, కోశాధికారిని. సాంబశివరావు పత్రికను జందాదారుల కందఁజేయుకార్యము నిర్వహించువాఁడు.

నే నిట్లు పత్రికాప్రచురణమును గుఱించి ప్రయత్నించు చుండఁగా, 17-వ తేదీని వీరేశలింగముగారు నాతో మాటాడుచు, జనసామాన్యమున కుద్దేశింపఁబడిన యాపత్రికలో తెలుఁగు వ్యాసములే యుండవలె నని చెప్పిరి. ఇంతియ కాదు. ప్రార్థనసమాజము పేరిట నీపత్రిక ప్రచుర మగుటయె యుక్తము కాదనిరి. నేను గారణ మడుగఁగా, సమాజసభ్యులలోఁ బలువురు విద్యార్థులె యగుటచేత, పత్రికయందు మంచివ్యాసము లుండవనియు, చేతఁగాని వ్రాఁతలవలన సమాజమునకును అధ్యక్షులగు తమకును నపకీర్తి యాపాదించుననియు, కావున నాపేరిటనే పత్రిక వేయుట యుక్తమనియు పంతులుగారు చెప్పిరి!

ఇది నాకు సమంజసముగఁ గనఁబడలేదు. పత్రికాప్రకటనము, సమాజాదర్శముములను బ్రకటించుటకే కాని, నా సొంతయభిప్రాయముల నెలకొల్పుటకుఁ గా దని నేను జెప్పివేసితిని. సత్యసంవర్ధనిని సమాజపత్రికగాఁ బ్రచురింపఁ గోరితిమేని, అందుఁ దనురచనలకు ప్రాముఖ్యము గలుగవలె నని యంతట పంతులుగా రనిరి. నే నందుకు

౧౪౧