పుట:2015.373190.Athma-Charitramu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 112

తండములుగ రోగులు వచ్చుచుండిరి. రోగి నొకచోట స్నానము చేయించి, "నీ రోగనివారణ మైనది, పో ! ఇది దేవునియాజ్ఞ !" అని వైద్యుఁడు పలుకుచుండునఁట! దీనినిగుఱించి జనులలోఁ గొంత చర్చ జరిగెను.

ఈ వైద్యరహస్యము నా కపుడు తెలిసినది. ఆగ్రామమందలి చెఱువునీటిలో లోహద్రవ్యములు గలసియున్నవి. దీనివలననే జనుల కుపశమనము గలుగు చున్నది గాని, వైద్యునిమహిమమునఁ గాదు! మాతండ్రికిఁగూడ దొండపూడివైద్యుని మహాత్మ్యమును గుఱించి నమ్మకము లేదు.

మఱునాఁడు కాంతయ్యగారితో నేను వాదమునకు డీకొంటిని. అనర్థదాయకమగు దురాచారముల నైన నీయన యిపుడు బాహాటముగ సమర్థించుచుండెను ! వేశ్యజాతివలన హిందూసంఘమునకుఁ గలుగులాభము లీయన పేర్కొనఁజొచ్చెను ! ఇపు డీయన విగ్రహారాధనాతత్పరుఁ డయ్యెను ! అయ్యో, యీతఁడు నేర్చిన తర్కవేదాంతములపర్యవసాన మిదియేనా?

దారిద్ర్యదేవత తాండవ మాడెడి మా సంసార పరిస్థితులఁ దలపోసి, 3 వ నవంబరున నే నిట్లు వెతనొందితిని : - "ఓ దారిద్ర్యమా ! నా బోటియువకులు నిర్మించెడి యాకాశహర్మ్యములను నీ వెట్లు గాల్చి వేయుచున్నావు ! ఉన్నతోద్యమములకును ఉదార భావములకును నీవు ప్రబలవిరోధివి. మాగృహమునుండి ని న్నెటులు తఱిమివేయఁ గలను ? నీ విచట నివాస మేర్పఱుచుకొని, నా విశాలాశయముల యసువులఁ దీసివైచుచున్నావు ! నీప్రేరణకు లోఁబడి, ప్రేమాస్పదమైన యాదర్శములను త్యజింపనా ? నా సౌశీల్యమును నీకు ధారవోసి