పుట:2015.372412.Taataa-Charitramu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనులు హెచ్చుగవచ్చుచున్నను, ఆయన వాని అద్దెలను అనవసరముగ వృద్ధిచేయుట లేదు; కొద్ది రేటులాభముకే తృప్తుడగు చుండెను.

అంతట తాతా ప్రపంచపు సుందరభవనములలో నొకటి బొంబాయి కలంకారము మనదేశముకంతకు నాదర్శమునగు నొక మహాభవనమును నిర్మించెను. ఇదియే 'తాజ్‌మహల్ హోటలు'. మన మహానగరములన్నిటిలోను అన్ని దేశములనుండివచ్చు మహనీయులగు యాత్రికులు వసించుటకు ఆధునిక సౌకర్యములనిచ్చు హోటళ్ళు అన్నియు యూరపియనులవే; వానిలోను పాశ్చాత్యశాలలోనుండు నన్ని సౌకర్యములు లేవు; మరియు అందుభారతీయులకుచితస్థానముండదు. ఈలోపములదీర్చుటకు, తాతా 1898 లో 'తాజ్‌మహల్ హోటలు' నారంభించి యైదేండ్లలో దానిని బూర్తిచేసెను. ఇది బొంబాయి హార్బరుప్రక్కను సముద్రమున కెదురుగా నున్నది. దేశాంతరములనుండి స్టీమరులపై వచ్చువారికి రేవుకు చాలదూరము నుండియు నీటిపైన ముందుగ బొంబాయిలో నీభవనమే రమణీయముగ గాన్పించుచుండును. శ్రీమంతులు సామాన్యులు అన్నిదేశములవారు గూడ బసచేయుటకిందు తగువసతియు, వారివారి యాచారముల కనుకూలమగు సౌకర్యములును కలవు. వెలుతురును సర్వకాలములందును సముద్రపుగాలియు నన్నిప్రక్కలను ప్రసరించునట్లుగా దీని గదులు విశాలమగు కిటికీలతో గట్టబడినవి; ఐనను దీని నిర్మాణ