పుట:2015.372412.Taataa-Charitramu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైన, ప్రశస్తమగు నిర్మాణపరికరములతో నుక్కుస్థంభముల మూలమున చాల యంతస్థుల మేడల నిర్మించెను. విశాలమగు వరండాలు; గాలికెదురుగ పెద్దకిటికీలు గల్గి, మేడపైనగూడ నీటిసదుపాయము, విద్యుచ్చక్తి యేర్పాటుతో వంటలు, లోనికి వెలుతురునిచ్చు నద్దపుపైకప్పులు, చలువరాతి చీడీలు మొదలగు చక్కని సౌకర్యము లమర్చబడెను. అప్పటికింకను మనదేశమున వ్యాప్తిలేకున్నను, తానుకట్టు భవనములందు తాతా యెలెక్ట్రికు (విద్యుత్) దీపముల నమర్చెను. ఆభవనము లందనేక కుటుంబములు పరస్పర సంబంధ మక్కరలేకుండ వేర్వేరుగ కాపురముండునట్లు సౌకర్యముల నేర్పర్చెను; వానిని న్యాయమగు బాడుగకు మధ్యరకపు ఉద్యోగులకు వర్తకులకు అద్దెల కిచ్చుచుండెను. ఆసుందరభవనముల చక్కని వసతినిబట్టియు, వ్యాపారస్థలములకవి సమీపముగ నుండుటవలనను, చాలమంది యాభవనములందే కాపురముండుటకు వచ్చుచుండిరి. తాతాయు వారియవసరముల దెలుసుకొనుచు, సలహాల గ్రహించుచు, వారికి వలయు కొత్త సదుపాయముల నమర్చుచు, సహృదయుడై, వారికష్టసుఖములందు సానుభూతి కల్గియుండెను. ఆయన కట్టించిన ఎస్ప్లనేడు భవనము, విక్టోరియా బిల్డింగ్సు, జూబిలీబిల్డింగ్సు మున్నగు ఆసౌధగృహములు బొంబాయిలోను ఆరాష్ట్రమంతటను గూడ త్వరలోనే ప్రసిద్ధములయ్యెను. వానిలో చక్కని బల్లలను, కుర్చీలను, తాను