పుట:2015.372412.Taataa-Charitramu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందు సరియైన వీధులనుంచి, మరుగుదొడ్లకు ఆటస్థలములకు ప్రత్యేకమగు వసతుల గల్గించెను. మంచి కిటికీలనుంచి గాలి వెలుతురు తగులునట్లు చౌకలోనే చక్కని కుటీరములను బారులుగను మనోహరముగను గట్టెను. కూలీల స్నానపానాదులకు మంచినీళ్ళవసతి నేర్పరచి, మురుగునీరు పోవుటకును తగునేర్పాటుల జేసెను; వానికి కొద్దిపాటి అద్దెనే స్థిరపర్చెను. ఆకుటీరముల పేటలు ఆరోగ్యకరములై, కూలీల కాకర్షకములై, ఆదర్శరూపముగ నుండెను. వానినిజూచి కొందరితరులును అట్టి కుటీరపంక్తులనే నిర్మించిరి. తాతా తనకూలీల కుటీరములందు వ్యాయామస్థలములను వైద్యశాలలను విద్యాలయములను పఠనమందిరములను నిర్మించి, వానినుచితముగ నడుపుచుండెను. అందువలన నాకార్మికుల దేహమనశ్శక్తులు వృద్ధి యాయెను.

ఇట్లు క్రమముగా బొంబాయి మిల్లుప్రాంతములందు కొంత ఆరోగ్యస్థితి కార్మికజనులకు సౌకర్యములు నేర్పడెను. జనులు నధికారులును దూరదృష్టి లేక గృహములను వీధులను నిర్మించుటచే, నగర మనారోగ్యముగనున్న స్థితిలో, ఆసార్వజనిక నగరమున పశ్చిమదేశములనుండి ప్లేగు (మహామారి) తగిలెను; అంటువ్యాధులు ఆనగరమును వీడక, ఏండ్లకొలది బాధింపజొచ్చెను. ఈప్లేగు 1895 నుండి చాలతీవ్రముగ వ్యాపించెను; అందుచే చాలజనులు చనిపోయిరి, అనేకులు నగర