పుట:2015.372412.Taataa-Charitramu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నగ్రామముగ నుండి, 17 వ శతాబ్దినుండి పాశ్చాత్య స్పర్శ కలిగినమీదట వర్తకము కోస్తావ్యాపారము వృద్ధియైనందున మద్రాసు కలకత్తాలవలె క్రమముగా నది పెద్ద పట్టణమయ్యెను. కాని ఈతక్కినపురములకన్న బొంబాయి యూరపుకు చాల దగ్గర; పాశ్చాత్యులకది మనదేశపు ద్వారముగనుండెను. మరియు బొంబాయిరేవు మద్రాసు కలకత్తాలకన్న చాల ప్రశస్తము, నైసర్గికము, చాలభద్రము అందువలన 19 వ శతాబ్ది మధ్యకది చాల వేగముగ వృద్ధియయ్యెను. కాని యందు మహాభవనము లేర్పడినను, వానిని తగిన కట్టుబాట్లు పురనిర్మాణపద్ధతులు లేకుండ, అవసరమునుబట్టి జనులు తమకు తోచినట్లెల్ల కట్టిరి. చాల యంతస్తుల పెద్దమేడలు చిన్న యిండ్ల ప్రక్కను, ఇరుకుసందులవద్దను, ఏర్పడెను. వీధులు బారుగను విశాలముగను లేక, కశ్మలముగ నుండెను.

బొంబాయిలో దబాటువాన యధికము. నగరము హఠాత్తుగా జలమయమగుచుండెను. నీటిపారుదలకు తగు నేర్పాట్లు లేకుండెను; ఆహర్మ్యములు మధ్యకాలపురీతివై, బ్రహ్మాండమగు బోషాణములవలె నుండెను; గాలి మెలుతురు గృహములోపల ప్రసరించుటకు వీలులేకుండ కట్టబడెను.


*[1]

  1. * 17, 18 వ శతాబ్దులందు మనదేశమం దశాంతి బందిబోట్లభయమును వృద్ధియగుటచే, శ్రీమంతులు భద్రతయే ప్రధానముగ జూచుకొని, తమభవనములను ఇరుకుగను పెద్ద పెట్టెలవలెను గట్టుచుండిరని తోచును.