పుట:2015.372412.Taataa-Charitramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. వస్త్ర పరిశ్రమ : ఎంప్రెసు మిల్లు.

ఆహారమువలె వస్త్రమును ప్రతివానికిని అవసరము.*[1] పూర్వము నార ఆకులు ధరించిన యాటవికులును ఇప్పుడు బట్టలనే ధరించుచున్నారు. ఉన్ని, పట్టు, జంతు సంబంధములు, ప్రియములు; మరియు అవి హెచ్చువేడి నిచ్చును; అందుచే నుష్ణమగు మనదేశమున, జనసామాన్యము దూదిబట్టలనే వాడును. సాధ్యమైనంతవరకు ప్రతిదేశమువారును తమ కవసరమగు దూదిబట్టలను నేసుకొనవలెను; లేనిచో విదేశములనుండి తెచ్చుకొని, అందుల కిమ్మతుసొమ్ము ఆవిదేశముల కిచ్చుకొనవలెను.

నూలు వడకి బట్టల నేయుట మనదేశమున వేలకొలది యేండ్లనుండి పరిపాటియే. రాట్నపునూలుతో చేతిమగ్గములపైన మనదేశీయులు నేసిన సన్నని నాజూకువస్త్రములు పూర్వము ప్రాచీనగ్రంథములందును ఖండాంతరచరిత్రలందును †[2] ప్రసిద్ధములై యుండెను. వంగదేశపు ఢక్కా మస్లినులు, నైఋతి ప్రాంతపు కాలికోలు, బందరు కలంకారీలు, విదేశములందును

  1. * నగ్న సిద్ధాంతము కొంత వినోదహేతువైనను జనులలో వ్యాపించుట లేదు. మానరక్షణముకేగాక, శీతోష్ణాదులతీవ్రతనుండి శరీరమును కాపాడుటకును వస్త్రధారణమవసరమే.
  2. † క్రీ. పూ. 4 వ శతాబ్దిలో అలెగ్జాండరుతో మనదేశముకు వచ్చిన గ్రీకుచారిత్రకులు ఇతర లేఖకులు మనదేశమువలన మిక్కిలి సన్నవస్త్రములు నేయబడి వాడుకలోనున్నట్టులవర్ణించిరి. సంస్కృత కావ్యగ్రంథములందు గూడ నిట్టివర్ణనగలదు.