పుట:2015.372412.Taataa-Charitramu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రచురించితిని. వ్యాపారవిషయమున తాతా యవలంబించిన పద్ధతు లందరును నేర్చుకొనదగినవి. ఆయనచర్య లన్నిటిలోను విశేషతకలదు; వాని స్వభావమును, (చర్వితచర్వణమైనను) చివర అధ్యాయములో, ప్రత్యేకముగ చిత్రించితిని. భారతదేశపు ఐహికాభివృద్ధికై, ఆధునిక భారతీయులలో నింకెవరి కన్నను జంషెడ్జితాతాయే యెక్కువకృషిచేసెనని విదేశీయులు కూడ భావించుచున్నారు. *ఆయన ధనమును పరమావధిగ నెంచక, సత్కార్య సాధనముగనే యెంచెను.


__________
  1. * He did more for its material regeneration than any other Indian of modern times" Lovat Fraser's 'India under Curzon and after' P. 324."