పుట:2015.372412.Taataa-Charitramu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాల మమూల్యమని గ్రహించుటచే జంషెడ్జి తనకాలమునెన్నడును వృధపరుపలేదు; సంచారములలోను ఆయన కేవల వినోదముల జూడక, తాను సంకల్పించు ఉద్యమముల వృద్ధికి వలయుసంగతులపైనే తనదృష్టినుంచుచు, విదేశపరిశ్రమలందలి విశేషములను చౌకపద్ధతులను, క్రొత్తవస్తువుల ఉత్పత్తి విధములను, మనదేశమందు ప్రవేశింపజేసెను. మనకు ముఖ్యమగు వస్త్రపరిశ్రమ బాగుపడుటకై ఆయన యవలంబించిన వివిధపద్ధతులు ఆయనప్రజ్ఞకు నిదర్శనములు.

వ్యాపారములోను ఆయన స్వార్ధపరుడుకాక, భారత జాతిక్షేమమే ప్రధానముగ భావించెను; ఆకాలమున, ఎగుమతిచే ముదుకనూలుబట్టలపైన లాభము వచ్చుచున్నను, మన దేశీయులు చాలమంది విదేశపు సన్నబట్టల ధరించుట గమనించి, అందుచే విదేశములకుపోవు ధనధార నాపుటకు, సన్ననూలు బట్టలమిల్లులను మనదేశమందే స్థాపించెను. విద్యావంతులను చక్కని కార్యకర్తలుగా తనమిల్లులందు తరిఫియతుచేసి, తన వ్యాపారమర్మముల దెలియజేసి, వారిని నితరుల మిల్లులకును కార్యకర్తలుగ బంపుచుండెను. తనమిల్లులందలి క్రొత్తపద్ధతులను మిత్రులకందరకు మర్మము లేకుండదెల్పి, ఆప్రకారము సన్ననూలుమిల్లుల స్థాపింపుడని, తోటిమిల్లుదారుల బ్రోత్సహించెను. చాలశ్రమకోర్చి అందుకైన విశేషవ్యయమును భరించి, క్రొత్తయంత్రముల దెప్పించి, ఆయన వానినుపయోగించుపద్ధతిని