పుట:2015.372412.Taataa-Charitramu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుప్రసిద్ధకర్మాగారముల బరీక్షించి, అనేకసమస్యల నచటి గొప్పవ్యాపార నాయకులతో చర్చించి, ఆసంస్థలను స్థిరముగ స్థాపించి నడుపగల ఉత్సాహులు విశ్వాసపాత్రులునగు పాశ్చాత్యప్రవీణుల నెన్నుకొనెను; (ఆరంభదశలో వారి సహకార మత్యవసరమాయెను.) ఆయుద్యమముల కాంగ్లసీమలోని భారతమంత్రియు మనదేశమందున్న భారతప్రభుత్వమువారును సుముఖులగునట్లు చేయగలిగెను; అనేకవిఘ్నముల నెదుర్కొని దాటెను; వానికి సంబంధించిన యమూల్యమగు వాఙ్మయమును అనేకపరికరములను భద్రపరచి, తనపుత్రమిత్రులకు వశముచేసెను.

ఈసంతతకృషివలన 1900 నుండియు, ఆయన యారోగ్యము క్రమముగ చెడి; దేహము క్షీణించెను; నీరసము హెచ్చెను. వ్యాపారసందర్భమున ఆయన తరుచు విదేశములందు యాత్ర చేయవలసివచ్చెను. అమెరికా యూరపులనుండి 1902 సాలాఖరున మనదేశమునకు తిరిగివచ్చి, తన మహోద్యమముల స్థాపనకై సిద్ధముచేసిన ఆయా ప్రణాళికల పరిశీలించుచు, శ్రమపడుచుండగ, ఆయనకు దౌర్బల్యము క్రమముగ హెచ్చి, వ్యాధి యధికమయ్యెను. వైద్యులేర్పర్చిన యాహారనియమముల నాయన సరిగా పాటింపలేకపోయెను. వెంటనే యారోగ్యముకై యూరపుకు వెళ్ళవలెనని వైద్యు లాయనను ప్రోత్సహించిరి. ఆయన మొదట నంగీకరించలేదు; కాని తరువాత తన సహజమిత్రుడగు ఆర్. డి. తాతా తొందరజేయగా, ఆయ