పుట:2015.372412.Taataa-Charitramu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్దసొరంగములద్వారా తేబడి, *[1] అటనుండి 7 అడుగుల వెడల్పుగల పెద్దయుక్కు గొట్టములద్వరా 1734 అడుగుల క్రిందికి వేగముతో విడువబడును. ఈమహాజలధార కచట అంగుళముకు 750 పౌనుల రేటున యొత్తిడియుండును. అట్టిమహాశక్తితో వచ్చునాధార యచ్చటనుంచినయుక్కు చక్రముల నతివేగముగ త్రిప్పివేయును. అందుచేజనించు మహాశక్తి యంత్ర సహాయమున ఎలెక్ట్రిసిటీ (విద్యుచ్ఛక్తి)గా మార్పబడును. అప్పుడాశక్తి 5వేల 'వోల్టు' లది; దానిని మరియొక మహాయంత్రపు సహాయమున కుదించి, దానిని లక్షవోల్టులగా చేయుదురు. ఆ 'పవర్‌హౌసు' (శక్తిగృహము) నుండి బొంబాయినగరమందలి 'పరేల్‌' అను మిల్లుపేటకు 43 మైళ్లుండును; మధ్యను ఉప్పుటేళ్లు; సముద్రపు పాయకూడ, దాటవలెను. ఈ 43 మైళ్ళును లోతుగ కాంక్రీటు పునాదులతో 200 అడుగులయెత్తున బలీయములగు నుక్కు స్తంభములనుపాతి, వానిపైనుండి రాగితీగలనుబిగించిరి; ఈతీగల పైన పవర్ హౌసునుండి 'పరేలు^'లో నిర్మించిన రిసీవింగ్ స్టేషను

  1. * ఈయయిదు మైళ్ళపొడుగునను ఆనదికడుగున నేల చదును చేయబడి, రాతితోను సిమెంటుతోను గట్టిగా కట్టబడినది. పైనరోడ్డు వంతెన, క్రిందనుంచి రైలుమార్గమును, కట్టవలసివచ్చెను. కొండయందు రాతినేలకానందున, అచట నీరింకి నేలదిగి పోకుండుటకై, అంచుభాగమంతయు కాంక్రిటుతో గట్టిచేయబడెను. ఆకొండపైన రాళ్లలో బిగించియుంచిన పెద్ద యుక్కుగొట్టములు శీతోష్ణములకు తగ్గి హెచ్చుటచే కలుగుచిక్కులు తప్పుటకు వైజ్ఞానికమగు కట్టుదిట్టముల జేయవలసివచ్చెను.