పుట:2015.372412.Taataa-Charitramu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందు వాస్తువిద్య, విద్యుచ్ఛక్తి, ఖనిజశాస్త్రము, రసాయనము, పారిశుధ్యశాస్త్రము, లోహశాస్త్రము, కార్ఖానా నిర్మాణము, మున్నగు విద్యలందు పరిశోధనకును ప్రత్యక్షానుభవముకును చాల అవకాశముకలదు. అందువలన ఇచట పనివాండ్ర జ్ఞానాభివృద్ధికిని మంచి యవకాశముండును. ఈసౌకర్యముల నేర్పర్చుట కంపెనీవారి దూరదృష్టిని తెల్పును. (కంపెనీలోని యుద్యోగులు కార్మికులు ఆరోగ్యవంతులు జ్ఞానవంతులు నగుటవలన, కంపెనీవారి పనులు ప్రశస్తముగ జరుపబడి కంపెనీకిని లాభమే కలుగును.)

ఈపురమున నీకంపెనీవారి కార్ఖానాలనుండి వేర్వేరు మచ్చుల యినుమును ఉక్కును చౌకగ, వలయునంత సమృద్ధిగ, వలయునప్పుడెల్ల దొరకును; శిల్పజ్ఞానముగల నిపుణులగు పనివాండ్రకును లోటులేదు. అందువలన, ఈనగరమందే కొన్ని యనుబంధపరిశ్రమల కంపెనీ లేర్పడినవి. ఇందలి 'జూట్‌మెషినరీ కంపెనీ' వారు కలకత్తామున్నగు ప్రాంతములందలి జనపనార పాక్టరీలకు వలయు యంత్రముల తయారుచేయుదురు. *[1] 'టిన్

  1. * సంచులుమున్నగువానిని తయారుచేయు జూటుమిల్లులకు కలకత్తానగరము ముఖ్యకేంద్రము; ఆమిల్లులయజమానులు చాలవరకు బ్రిటిషువారు; ఆమిల్లులకు తరుచు కావలసియుండు వివిధయంత్రములను పనిముట్లను వారు విదేశములనుండియే తెప్పించుకొనుచుండిరి. అచటికి 150 మైళ్ళలోనే మంచి యినుము ఉక్కు దొరకుచున్నందున, జూటుమిల్లులకువలయు కొన్నియంత్రములుగూడ జంషెడ్పురమందే తయారగుట సుకరమైనది.