పుట:2015.372412.Taataa-Charitramu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రి యుద్దేశించిన పరిశ్రమల నడుప నిశ్చయించిరి; జంషెడ్జికి కార్యదర్శిగనుండిన బర్జోర్జిపాద్షాయు వారి నుత్సాహపూరితుల జేసి, బొంబాయిలొ కేంద్రకార్యాలయమునుండియే పనులన్నిటిని చక్కబెట్టుచుండెను.

ఈయినుపగనుల గనిపెట్టిన ప్రమధనాధు డప్పటి కుద్యోగకాలముతీరి, ఆసమయమున నోఢ్రప్రాంతమందే, 'మయూరభంజి' సంస్థానములో దివానుగా నుండెను. ఈవిచిత్రసంఘటనమువలన, తాతాకంపెనీవారి ప్రయత్నముసంగతి యాయనకు తెలిసి, మయూరభంజి సంస్థానములో నింకను నత్యుత్తమములగు లోహగనులు కలవని, వానిని సులభముగ పనిచేయవచ్చునని, అందుకు మహారాజుచేత నవసరమగు కవుళ్ళనిప్పించెదననియు, ఆయన తాతాకంపెనీకి వ్రాసెను.

పెరినుగూడ వారిని చేరినందున, ఆచతుష్టయమును రాజుగారి యాహ్వానముపైన, మయూరభంజి రాజ్యముకు జనిరి. ఈరాజ్యము సుమారు 4000 చదరపు మైళ్ళుండును. దాని మధ్యను విశాలమగు మహాటవులతో నిండి వనగజములతో సంకులమగు వేయిమైళ్ళ కొండభూమి కలదు. వా రాగహనములందు జొరబడి, దిగ్భ్రమజెందుచు ప్రమధనాధుడు దోవచూపిన ట్లెల్ల బోవుచుండిరి. చాలదూరమువర కంతయు నగమ్యగోచరముగ నుండెను. అప్పుడు వారికి మూడువేల యడుగుల యెత్తగు 'గురుమైశిని' గిరి ప్రత్యక్షమయ్యెను. దానిని