Jump to content

పుట:2015.370800.Shatakasanputamu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     సుందర విగ్రహ మునిగణ
     వందిత మిము దలఁతు భక్తవత్సల కృష్ణా!98
క. ఓపాలదొంగ మురహర
     పాపాలను బాఱఁదోలు ప్రభుఁడవు నీవే
     గోపాలమూర్తి దయతో
     నాపాలిటఁగలిగి ప్రోవు నమ్మితిఁ గృష్ణా!99
క. అనుదినము కృష్ణశతకము
     వినినఁ బఠించినను ముక్తి వేడుక గలుగున్‌
     ధనధాన్యము గోగణములు
     తనయులు నభివృద్ధిఁ బొందు దద్దయుఁ గృష్ణా!100
క. భారద్వాజసగోత్రుఁడ
     గారవమున గంగమాంబ కరుణాసుతుఁడన్‌
     పేర నృసింహాహ్వయుఁడను
     శ్రీరమయుత నన్నుఁగావు సృష్టినిఁ గృష్ణా!101

శ్రీకృష్ణశతకము
సంపూర్ణము