Jump to content

పుట:2015.370800.Shatakasanputamu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. మందుఁడ నే దురితాత్ముఁడ
     నిందల కొడిఁగట్టినట్టి నీచుని నన్నున్‌
     సందేహింపక కావుము
     నందుని వరపుత్ర నిన్ను నమ్మితి గృష్ణా!60
క. గజరాజవరద కేశవ
     త్రిజగత్కల్యాణమూర్తి దేవ మురారీ
     భుజగేంద్రశయన మాధవ
     విజయాప్తుఁడ నన్నుఁగావు వేగమె కృష్ణా!61
క. దుర్మతినై బలుకష్టపుఁ
     గర్మంబులఁ జేసినట్టి కష్టుండ నన్నున్‌
     నిర్మలునిఁ జేయవలె ని
     ష్కర్ముఁడ నిన్ను నమ్మినాను సతతము కృష్ణా!62
క. దుర్వార చక్రధరకర
     శర్వాణీ భర్తృవినుత జగదాధారా
     నిర్వాణనాథ మాధవ
     సర్వాత్మక నన్నుఁగావు సరగున కృష్ణా!63
క. సుత్రామనుత జనార్దన
     సత్రాజిత్తనయనాథ సౌందర్యకళా
     చిత్రావతార దేవకి
     పుత్త్రా ననుఁగావు నీకు బుణ్యము కృష్ణా!64
క. బలమెవ్వఁడు కరిఁ బ్రోవను
     బలమెవ్వఁడు పాండుసుతుల భార్యను గావన్‌