255
ఒక మగపెళ్ళివారు, రాత్రి, బాజాలతో భోజనానికి బయల్దేరి, వెనుకాల ఆడంగులూ ముందు మొగంగులూ నడక నడుస్తూండగా, కాగడావాడు ఆడంగులదగ్గిరే ఆగిపోగా, మగవారిలో ఒకరైన
ప్రసాదరావు - ఒరేయి కాగడా! మాకు వెలుతురు లేదురా!
కా - వెనకాల ఆడంగులండి బాబూ!
ప్ర - సరే, ఏడిసినట్టేఉంది. ఇక్కడ మేం మాత్రం !
256
సన్యాసి - (ఇంటివారితో) పోనీ మీరన్నట్టు నేను కామమ్మ మొగుణ్ణి కాకపోతే నా కర్రాబుర్రా నాకు పారెయ్యండి! వెధవ గోలొచ్చిపడింది. వీళ్ళగోల మండిపోను.
ఒకస్త్రీ - ఏమిటి నాయనా! అన్నీ అయాయిరీ, ఇంకా పైపెచ్చు ఏముటోచికాకు పడతావు, ఏం రోగం? నీ చికాకు చిచ్చంటించా!
స - చికాకా చికాకున్నరా ! ప్రతీ ఊళ్ళోనూ ప్రతీకొంపలోనూ నాకు ఇల్లా అవుతూంటేను!
257
సుబ్బారాయుడు వనమయ్యగారికి ఉత్తరంరాసి పెడుతూండగా చిరంబరంగారు వచ్చి, చి - ఏముటోయ్ సుబ్బారాయుడూ! పెదిమిలు బిగపట్టావ్ కనుబొమ్మలు ముడెట్టావ్, కలం పట్టట్టావ్, సర్రుమనిపించేస్తున్నావ్, ఏమిటదీ?
సు - నీ కెందుకుపోవయ్యా! ఆయనేదో నాకాళ్ళుపట్టుగుంటే ఓ ఉత్తరం గోకిపెడుతున్నాను.
చి - అల్లా అయితే వనమయ్యా! నువ్వు వసుదేవుడంతటివాడవని ఇప్పటికి విశదం అయింది.
258
సుబ్బకవి - ఏమండీ లచ్చయ్యగారూ! ఈ మధ్య మీరు మెడ్రాసు వెళ్లి వొచ్చారటా!
ల - మరేనండి.
సు - వ్యవహారపు పని గావును.
ల - మరేనండి. కొన్నికృతులు చేశానుగా!
సు - ఆకృతులు అచ్చుకొట్టిద్దామనా?
ల - మరే.
సు - అయితే త్యాగరాయకృతులు చేసింది మీరేనా ఏమిటీ!
259
బేరగాడు - షాహుకారూ! తమలపాకులు మోదెల్లా!
షా - మూడణాలండి. ఏమాత్రం?
బే - వందెల్లా?
షా - ఏడుకాన్లు ఇవ్వండి.
బే - కానీకి ఏమాత్రం వస్తాయి?
షా - ఇంతేటండీ బేరం! పదీ!
బే - ఓ దమ్మిడీవి కట్టూ!
షా - కొన్నా వెల్లవయ్యా !
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
58
హాస్యవల్లరి