ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము
133
అన విని పాంచాలి. యసురేశుమోము
గనుఁగొని గద్గదకంఠయై పలికె
మాయన్న ! దై తేయమండలాధీశ!
మీయయ్య నెరయోధ మిక్కిలి నీవు
విలుకాండ్ర మేటివి వీర శేఖరుఁడ 1365
నలఘుతరోగ్ర మాయా ప్రవీణుఁడవు
అసహాయశూరుండ వని యెఱుంగుదును
పొసఁగ నీశౌర్య మిప్పుడు గానవచ్చె
నేకాకియై భీముఁ డేఁగు నవ్వేళ
ప్రాకట చతురంగబలములం గూడి. 1370
నిచ్చట నీ వుండు టిది ధర్మ మగునె!
హెచ్చైన రథికుల నిటగాపుఁ బెట్టి
చనరాదె నీవు నీజనకుని వెంట
ౘనవరి వగుచు నిచ్ఛటను నీ వున్న
దనుజవీరులనైనఁ దగ నంపవలదె ! 1375
వనవీధియందు నెవ్వరు లేనిచోట
దిద్ది మీసము దువ్వి దిగ్గన లేచి