Jump to content

పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

సౌగంధిక ప్రసవాపహరణము

మాయన్న చెంత నెమ్మది నిన్ను నిలిపి
పోయెదఁ దెచ్చెదఁ బ్రొద్దున లేచి
కనకాంగి సౌగంధికములు దేకున్న
పనుపడ నామోము పరికింపవలదు 1135

లోలాక్షీ ముగుదాటిలో గాలు దూర్చి
నేలమూర్ఖము మాను మీపనియంత
చనుదెమ్ము పోదముం జా గేల ననిన[1]
వనజదళాక్షి పావని కిట్టు లనియె
అనఘాత్మ నీవంటి యసహాయశూరు 1140

నినువంటి నెరయోధు నే వేడుకొనిన
కళవళపడి చేతగాని మానవుని
వలె దూరిపలుక నెవ్వరు చెప్పఁగలరు
మునుపు యిచ్చెద నని మొనసినవేళ
వెనుకముందఱఁ జూడ వీరధర్మంబె 1145

యీపని మీయన్న యింతయు విన్న
కోపించుకోరికల్' కొనసాఁగఁబోవు

  1. చనుదెమ్ము పోదాము జాగేల యనిన (క)