Jump to content

పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. శ్రీసగణస్య

వాదాంగచూడామణి—


చ.

అనిలుఁ డధీశుఁడున్‌ గువలయం బది కాంతి కులంబు హీనమున్‌
జను గ్రహమా శనైశ్చరుఁడు చాలఁగ నల్పగు నెన్న తౌల యౌఁ
దనరఁగ రాశి స్వాతి యగుఁ దార ఫలంబు క్షయంబు దానవం
బొనర గణంబు నామహిషయోని యగున్‌ సగణాన కీశ్వరా!

54[1]


కవిసర్పగారుడే—


మ.

అనిలుం డీశుఁడు స్వాతి తార రుచిశ్వేతాభావ మెన్నన్ గ్రహం
బినజుండౌ తులరాశి హైన్యముకులం బేసారక్షీణంబు దా
మును లబ్ధంబు భయంబు తద్రసము, కార్పోతెమ్మయిన్ యోని యొం
దును దైన్యంబు గణంబు నాసగణ మెందున్ గీర్తిప్రాచుర్యమై.

55[2]


టీక.

అధిపతి వాయువు, స్వాతినక్షత్రం, ఛాయ నల్పు, గ్రహం శని, హీనకులం, క్షీణఫలం, భయరసం, మహిషయోని, రాక్షసగణం, గౌతమసగోత్రం, జననం హశంఖనామయామం నాల్గవది.


భీమనమతం – బుధుఁ డన్నాఁడు. అందుకు పరిహారం మునుపె వ్రాసినది.


ఆదిప్రయోగ ఫలవిశేషమ్—


సాహిత్యరత్నాకరమ్—


‘వాయుగణే శ్రమ’ ఇతి.

56[3]
  1. ఆ.రం.ఛం. అ 2. ప 2 ప 42. సు.సా.లో 253.
  2. ఆ.రం.ఛం. అ 2. ప 43
  3. కొంత చెడిపోయినది. కాని అ ర2 చం అ2 పం44లో పూర్తిగా నున్నది.