పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ట్లుదయించు నాకుఁ గీడె
ట్లొదవు న్మదిలోన బెగడకుండుము[1] భట్టీ. 141

క. జమునికి నెరగోసెద[2] నా
క్రమ మెఱుఁగవె యముడు నతఁడు కమలజఘటనా
సమయం బైన నసంభా
వ్యము లైనను సంభవించు నది యెట్లనినన్. 142

క. ఇది మానిసి యిది సింగం
బిది దేవత యను వివేక మెడలఁగ బలసం
పద నుక్కుఁగంబమున హరి
యుదయింపఁడె దైత్యవరుని నుక్కడఁగింపన్. 143

క. ఏకద్విత్రిచతుఃపం
చాకృతికృతసంఖ్యముఖుల కవిజేయుండై
కైకొనిన తారకాసురుఁ
బోకార్పఁగ షణ్ముఖుండు పుట్టుట వినవే. 144

మ. వరపుత్రుం డమరేంద్రవైరి పరిఖ ల్వారాశి యాలంక దా
గిరిదుర్గం బసురు ల్బలంబులు దశగ్రీవుండు రా జిట్లు బం
ధురమౌ రాజ్యము ఱాలు దేలగిల మిత్రు ల్శత్రులం గూడఁగా
నరులు న్వానరులుం గొనం దలఁచి చన్నం జేటు వాటిల్లదే. 145

ఉ. కావున నిట్టి బాలకుఁడు గల్గుట తథ్యము నీకు నిష్టులౌ
వేవులవారిచేతఁ బృథివీస్థలిలో నరయింపుమన్నఁ దా
నావచనంబు లియ్యకొని యాత్మహితుం దలపోసి విక్రమా
ర్కావనివల్లభుండు నెడ రంచుఁ దలంచెఁ బిశాచముఖ్యునిన్. 145

  1. బెదరకుండుము
  2. నొరగోసెద