పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

ప్రథమాశ్వాసము

    భూమిని మించిన భీమన
    నామంబునఁ బరంగె సత్యనారన ఘనుఁడై[1]. 49

ఉ. నారన కగ్రజుండు సుగుణజ్ఞుఁడు గంగమసింగమంత్రికిం
    గూరిమిపట్టి నాఁ బరఁగు గోపయమంత్రి నిజానువృత్తిఁ బెం
    పారెడు నెల్లమాంబిక కులాంగనగా నుతి కెక్కిఁ దారతా
    రారుచికీర్తి యాకసవరాజు తనూజుఁడు దాఁ బ్రసిద్ధుఁడై. 50

వ. ఇట్లు గోపరాజతనూజుండైన కసవరాజు దానగుణ రాధేయుం డగు రాణామల్లనరేంద్రునకుఁ బరమగురుండై
    శైవాచారప్రథమసింహాసనాధీశ్వరులైన [2]బ్రహ్మదేవవడియల
    కూఁతు కామాంబిక యను కామినీరత్నంబుఁ బరిగ్రహించి సుగుణగణగణ్యుం డై నెగడె. 51

ఉ. స్థేయుఁడు మంత్రిలక్షణవిధేయుఁడు లాలితదానకేళి రా
    ధేయుఁడు సర్వసజ్జనవిధేయుఁడు. సంతతసత్యవాక్యకౌం
    తేయుఁడు నిత్యకీర్తి సుదతీపరిణేయుఁడు భావశుద్ది గాం
    గేయుఁడు గాయకప్రకర గేయుఁ డమేయుఁ డజేయుఁ డున్నతిన్. 52

సీ. ప్రకటిత సరసవాక్పతి యనఁగాఁ జెల్లి
          చతురాస్యుఁడై పద్మజన్ముఁడనఁగ
    నార్యానుకూలమౌ కార్యంబు దీర్చుచు
          సర్వజ్ఞుఁడై మహేశ్వరుఁ డనంగ
    గామాంబఁ దనపత్నిగా గారవించుచు
         బురుషోత్తముండయి హరియనంగ
    గోపకుమారుండు కొడుకుగా నక్రూర
         దృఢమిత్రుఁడై వాసుదేవుఁ డనఁగ

  1. కవియై
  2. బ్రహ్మదేవయొడయల