పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

484

సింహాసన ద్వాత్రింశిక


య్యిరువుర రూపగుఁ గావున
వెరవుగఁ బరికింప నీవ విష్ణుఁడ వనఘా.

90


క.

ఈపుణ్యుని నినుఁ జూచిన
శాపావధి గలిగెఁ గల్మషం బడఁగెఁ గులో
ద్దీపక! “నావిష్ణుః పృథి
వీపతి" యనుకీర్తి నీకు విహితం బయ్యెన్.

91


చ.

అన విని చోద్యమంది వసుధాధిపుఁ డప్పటి శాపకారణం
బొనరఁగఁ జెప్పు మెవ్వ రని యుత్సుకుఁడై తను వేఁడినం గ్రమం
బున నది క్రమ్మఱం బలికె భోజనృపాలక! పార్వతీసఖీ
జనులము నేము దేవి కనుసన్నల దగ్గఱి కొల్తు మెప్పుడున్.

92


క.

ఒకనాఁ డేమును నయ్యం
బికయును విశ్రాంతి కేగి శుకపికభృంగ
ప్రకరపరితోషకర మగు
నొకవనమున విరులు గోయుచున్నెడ వేడ్కన్.

93


సీ.

కన్నుల విని గాఁలి జెన్నొందు నందియ
        యడుగుఁదమ్మికి బెడఁగడరఁజేయ
నందిని నులికించు పెందోలు హొంబట్టు
        కైవడి నునుపారఁ గాసెవోసి
తలఁచినయంతనే వలపులఁ దలకొల్పు
        వెలిపూఁత మేనెల్ల గలయఁబూసి
జక్కవకవ కెదురెక్కుడౌ రేవెలుఁ
        గెలమితో జడలపై వెలుఁగుచుండ


ఆ.

విసము మెడ నుండియును దీపి[1] వెలికిఁదోఁపఁ
గేలశూలంబు ఫణిపతి లీల మెఱయ

  1. దీప్తి