పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

471


ద్మంబునఁ బెట్టి, వక్షమున దాపి, మనోగతి లక్షణంబు వ
క్తంబునఁ దోఁపకుండఁ, జెలిక తైలు గొల్వఁగ నేగె నూరికిన్.

29


క.

ఇట నాతురుఁడై వజ్రము
కుటుండు ప్రియసఖుఁడు దన్నుఁ గొల్వఁగఁ బురి కా
దట నరుదెంచియు నొకచెం
గట నుండెం దెలియరాని [1]కనుబేటమునన్.

30


వ.

ఇ ట్లాకన్నియ నామగ్రామజన్మప్రేమాతిశయంబు లెఱుంగమి మిగులఁ బొగులుచు దాని తగులు వగల నొగులుచున్న రాజకుమారుం దెలుపకుండుట బుద్ధిగా దని బుద్ధిశరీరుండు డగ్గఱి నీ కింత చింతయేల విను మాకోమలి తలమీఁది యుత్పలంబు కర్ణంబునుం జేర్చుకొనుట కర్ణోత్ఫలుం డనురాజుగలఁ, డది దంతఘట్టితంబు సేయుట దంతఘట్టకుం డనం దన్మంత్రి గల, డది పదపద్మంబున మోపుటం బేరు పద్మావతి యగు, నది హృదయంబున నత్తుట నీవ హృదయేశ్వరుండ, వని సూచించె నప్పుడే నిశ్చయించితి నాకర్ణోత్పలుండు [2]కుంతలదేశం బేలుచుండు నని విందుము.

31


ఉ.

ఆతనిమంత్రికూఁతు భవదంగనగా నొనరించువాఁడ ర
మ్మా తలపోత లేల యని మానవనాథతనూజుఁ గొంచు న
న్వీతనిగూఢవేషముల [3]నేగుచుఁ గౌంతలకంబు చేరి మా
[4]ర్గాతిథివృత్తి నొక్కతె గృహంబున నిల్చి యనుక్రమంబునన్.

32


సీ.

ఈపురం బేలురా జెవ్వఁ డాతనిమంత్రి
        యెవ్వఁ డాతనికూఁతు రెవ్వరొక్కొ
యింతయు నెఱుఁగుదువే యని
        యడిగిన నుర్వీశ్వరుండు కర్ణోత్పలుండు

  1. కనుజతనమునన్
  2. కళింగదేశం
  3. నేగి కళింగపురంబు సొచ్చి
  4. ర్గాతురవృత్తి