పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv


"ఘనులగ్రజులకు నీడై
 వనములుఁ గ్రతువులును గృతులు వడి నిల్బిరి బా
 చనయును సింగనయును దగి
 రనపోతకుమార సింగయకు మంత్రులన౯!! (1-48)

గోపరాజు చిన్నతాత సత్తైనారన 'ఆంధ్ర కవితా పితామహు' డని భీమన అని పేరు పొంది రామాయణ కావ్యమును వ్రాసెనట (1-49). ఇతడు వ్రాసిన రామాయణము లభింప లేదు. సింగయ కుమారులలో రెండవ వాడైన గోపయకు గంగాంబ యందు కసవరాజు పుట్టెను. అతనికి వేముగల్లు రాజధానిగా నేలిన రాణా మల్లనరేంద్రునకు పరమ గురుండై శైవాచార ప్రథమ సింహాసనాధీశ్వరుడైన బ్రహ్మదేవ వడియల కూతురు కామాంబిక యందు ఈ కృతికర్త గోపరాజు పుట్టెను. తండ్రి కసవరాజు

"తంత్రముచేఁ గార్యము పర
 తంత్రము గాకుండఁ బతిహితమె చేయు మహా
 మంత్రులలోపలఁ గసవయ
 మంత్రి విచారమున దివిజమంత్రియుఁబోలె౯. (1-54)

మంత్రియై యుండిన రాణా మల్లనరేంద్రుని గూర్చి కూడ యేమియు తెలియుటలేదు. ఆయన కొడుకు గోపరాజు,

స్థలము- గోపరాజు తండ్రి కసవరాజు వేముగల్లు పాలకుడగు రాడా మల్ల నరేంద్రునకు మంత్రియై ఉండినట్లును, తాను ఆయూరనే పుట్టినట్లును తెలిపినాడు. అవతారికలోని (1.56) పద్యమునుబట్టి వేముగల్లు రాణామల్ల నరేంద్రునకు రాజధాని అని, కొండల నడుమ ఉన్న వనదుర్గమని, అందు శ్రీ విష్ణు మందిరమున్నదని తెలియుచున్నది. ఇది ఇప్పుడెచటనున్నదో గుర్తించుట కష్టము. మహబూబ్ నగరంజిల్లా కొల్లాపురం తాలూకాలో ఒక వేముగల్లున్నది కాని అది కాదు. కరీంనగరం వరంగల్లు జిల్లాలలో వేముగలు లున్న చో వానిలో నొకటి కావచ్చును.