పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

434

సింహాసన ద్వాత్రింశిక


ఆ.

యుగ్రదేవత యని యూహించి తలఁకక
రక్తపుష్పము లనురక్తితోడ
నొనరఁ బూజచేసి వినుతించి ప్రణమిల్లి
యచట గొలిచియున్న యవసరమున.

25


వ.

ఆనగరంబుదెసనుండి దిమ్ము రేఁగినయట్లు [1]తూఁగొమ్ములుఁ బువ్వనంగ్రోవులునుం దప్పెటలును డక్కులును బెక్కువిధంబుల దిక్కులు చెవుడుపఱుపుచు మ్రోయ నవ్వాద్యరవంబునకు బాసటయై తమయార్పులుం
బెడబొబ్బలును గిరిగహ్వరంబుల నుపబృంహితంబులుగా గంధపుష్పార్చితుం డగు నొక్కదీనుని నడుమ నిడుకొని కుఱుచ [2]కాసకోఱలు మెఱయించుచు బరికెతలల కఱకుఁగొండరులు సనుదెంచిన నప్పరమకారుణికుండు.

26


ఉ.

దీనుని నేటి కిచ్చటికిఁ దెచ్చితి రింతట దేవి మెచ్చునే
హీనుఁడు దుర్బలుండు జడుఁ డేడ్చెడి వీఁ డవలక్షణుండు మీ
రీనరుఁ దెచ్చి చూపి జగదీశ్వరి ని ట్లడికింపఁ జూతు రే
యేనుఁగు చిక్కెనేని మఱి [3]యెంపలిచెట్టునఁ గట్టవచ్చునే.

27


క.

వీనిం బోవఁగనిం డిదె
నే నుత్తమకులుఁడ మాంసనిబిడుఁడఁ బ్రియస
స్మానసుఁడ నన్ను నరబలి
గానిచ్చిన దేవి మెచ్చుఁ గరుణం బ్రోచున్.

28


వ.

అని యద్దేవికి నుద్రేకంబు పుట్ట వాని నిరసించిన తాను మెయికొనిన నాబోయలు నీకొండీనినే చంపించుట మే లని వానిని విడిచిపుచ్చి యతనికి నట్ల

  1. తూగొమ్మలునుం బువ్వనగ్రోవులునుం దప్పెట్లుం దింట్లును ఢక్కలును (దింట్లును అనుటకు, నుంట్లును అనియు)
  2. కాసలతో గొఱకలు మెరయిం
  3. వెంపలిచెట్టు అని వాడుక, యెంపలి యని యిందు ప్రయోగము