పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

428

సింహాసన ద్వాత్రింశిక


ఆ.

జేసి కంఠరక్తసిక్తంబు బలియిచ్చు
జనులకోర్కు లెల్ల శక్తి యిచ్చు
నమ్ముఁడనుచు శాసనము వ్రాసియున్నది
[1]యచటియాత్ర సేయ నరుగ మకట.

155


క.

అని పలుకఁగ వృత్తాంతము
విని విక్రమభూషణుండు విస్మితుఁడై వా
లును మగతనముం దోడుగఁ
జనియె న్మునుచనిన సవ్యసాచికి నెనయై.

156


చ.

అట చని కాంచె భూమివరుఁ డర్జునసిద్ధితపోనుకూలముం
గుటిలకిటిద్విపారిమదకుంజరసేవితసానుమూలముం
జటులగుణచ్ఛటారటితసంయమిరక్షణపుణ్యశీలముం
గటకమణిద్యుతిప్రకటకందరకూలము నింద్రకీలమున్.

157


చ.

కని గిరిమీఁద నున్న గుడికందువకుం జని యందుఁ దీర్ఘమ
జ్జన మొనరించి వచ్చి కొనసాగఁగ దేవికి భైరవాదికం
బునకుఁ బ్రియంబు సేయఁ దనమూర్తి వధింపను వేడ్క ఖడ్గ మె
త్తినఁ గరుణాప్రసన్న యయి దేవత యాతని నడ్డపెట్టుచున్.

158


ఉ.

ఇచ్చకు వచ్చినట్టివర మేమట వేఁడుము కా దనాక నీ
కిచ్చెద నన్న [2]భూమివరుఁ డీవు ననుం గరుణించితేని యే
యొచ్చెముఁ జూడ కాడుచును నోడుచు నిర్ధనుఁ డౌచునున్న యా
దిచ్చున కెల్లకాలము నతిద్రవిణం బొసఁగం దలంపుమా.

159


క.

అని వేఁడి యతని కర్థము
తనియఁగ నిప్పించి సమ్మదంబునఁ బురికిం

  1. యచటఁ జూడఁబోద మనుచు నిట్లు
  2. నాకువలయేశ్వరుఁడుం గరుణించితేని