పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

374

సింహాసన ద్వాత్రింశిక


ఉ.

ఆనరనాథుఁ డంత వసుధామరు వీడ్కొని వేడ్కతోడ ను
జ్జేనికి వచ్చెఁ గావునఁ బ్రసిద్ధగుణాఢ్యుని వానిఁ బోలలే
వీనగుఁబాటుచేత లిఁక నేటికిఁ గ్రమ్మఱు మన్న నాత్మ[1] ధా
రానర నాయకుం డతనిఁ బ్రస్తుతి సేయుచు నేఁగె నింటికిన్.

39


ఇరువదిమూఁడవ బొమ్మకథ

వ.

మఱియుం ద్రయోవింశద్వారప్రవేశోన్ముఖుండై .

40


క.

ఏవేళనైనఁ బొక్కిటి
[2]యా వెల్లని తమ్మిమొగ్గ యరవిరి గాఁగన్
రేవెలుఁగుఁ బ్రొద్దుఁ గన్నులు
గా వెలిఁగెడివేల్పు కరుణఁ గావుత మమ్మున్.

41


మ.

అనుచు న్భోజవసుంధరాధిపుఁడు పుణ్యాహంబునం జందనా
ద్యనులేపాంబరమాలికాకనకభూషాలంకృతుం డై మహా
సన మెక్కం జనుచోట బొమ్మ వలికెన్ క్ష్మానాథ యావిక్రమా
ర్కునిచందంబున దానవైభవము నీకుం జాల దట్లుండుమా.

42


ఉ.

అతనిదానవైభవమహత్త్వముఁ జెప్పెద భాస్కరాంశసం
[3]జాతుఁడు వాఁడు విక్రమవిశాలభుజాయుగదుర్మదాహిత
వ్రాతవిఘాతడక్షిణుఁ డవంతిమహీశుఁడు తొల్లి చన్న యా
దాతలలోనఁ గర్ణునికిఁ దండ్రిసుమీ తలపోసి చూచినన్.

43


శా.

ఆరాజన్యునిపట్టణంబు విబుధేంద్రాకల్పితం బై సుధ
ర్మారూఢంబును భాస్వదీశ్వరవసువ్యాప్తంబునై పుణ్యవి
స్తారంబై యమరావతీపురవిలాసం బంది నిత్యోత్సవా
దారంబై పరఁగున్ దురంతదురీతోదారవ్యథాదూర మై.

44
  1. నాత్మలో, నానరనాయకుం డతని నర్థి నుతింపుచు
  2. యావెలినెత్తమ్మిమొగ్గ
  3. జాతుఁడు విక్రమార్కుఁడు విశాల