పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

370

సింహాసన ద్వాత్రింశిక


ఉ.

అంత విదర్భభూమిఁ బ్రియ మంది చరించి యవంతిరాజు వి
శ్రాంతి యొనర్పఁ గుండినపురంబున కేగి యనంతరంబ య
త్యంతమనోహరం బగు నుపాంతవనాంతము సొచ్చి రుక్ష్మిణీ
కాంతకుఁ దొల్లి తాపి యనఁగాఁ దగు దుర్గగృహంబుఁ జూచుచున్.

19


క.

రుక్మి యనుమతము లేకయు
రుక్మాంగదవరదుఁ[1] డగు వరుం డాగుడిలో
రుక్మాభరణాంచిత యగు
రుక్ష్మిణిఁ గొని చనియెఁ దొల్లి రూఢికి నెక్కన్.

20


ఆ.

అట్టిదేవతాలయము పొంతఁ గొలనిలో
జలకమాడి వెడలి జలజములను
భూవరుండు దుర్గఁ బూజించి ముందట
విశ్రమించియున్న వేళ నొకఁడు.

21


శా.

మార్గశ్రాంతి నొకింత డస్సి విలసన్మాకందసౌరభ్యమౌ
దుర్గారామము చొచ్చి వచ్చి నరనాథుం జేరి విప్రుండు నా
స్వర్గాచార్యుఁడు వోలె నావిభునిభావం బెల్ల నీక్షించి సం
[2]సర్గప్రస్తుతి వాక్యవృత్తి నెఱపన్ సంప్రీతితో నిట్లనున్.

22


క.

ఆజానుబాహుఁడవు రవి
తేజుఁడ వబ్జాదిచిహ్నధృతచరణుఁడ వం
భోజేక్షణుఁడవు భిక్షు
వ్యాజంబున నున్న చక్రవర్తివి చుమ్మీ.

23


చ.

కరులుఁ దురంగమంబులును గాలుబలంబులు నెవ్వి ఛత్రచా
మరములవారు లెంకలును మంత్రులు నయ్యడపంబువాండ్రు నెం

  1. రుక్మాంబరధారి
  2. సద్భర్గం బ్రస్తుతవాక్యవృత్తి విలసింపన్ నేర్పుతో నిట్లనున్, సర్గప్రస్తుత ......విలసించన్