పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xlii


కముగ చెప్పి చింతచెట్లను గూర్చి 8 పద్యములు చమత్కారముగ వ్రాసెను. (3-145)

7. వస్త్రవిశేషములు- విక్రమార్కుని అంతఃపురస్త్రీలు నానావిధములైన వస్త్రములు ధరించుచుండిరని వాని పేరులు తెలిపినాడు. 49 విధములైన పట్టు-నూలు చీరల రకములను చెప్పెను. పాల్కురికి సోమనాధుడు బసవపురాణములో 56 విధములైన పట్టు-నూలు చీరలను పేర్కొన్నాడు. వానిలో కొన్నిటిని గోపరాజు పేర్కొనెను. ఉభయులును చెప్పినందున ఆనాడు కాకతిరాజ్యములో చేనేత పరిశ్రమ ఉచ్చస్థితిలో ఉండెనని తలప వచ్చును. (3-183)

8. ఆభరణ విశేషములు - రాణులు పాదమునుండి శిరస్సువరకు ధరించు 14 విధములైన అంగాభరణములను చెప్పెను. (3-188 వచనం.)

9. రాజకర్తవ్యములు. మూలమునందు రాజకర్తవ్యములు పంచ యజ్ఞములుగా చెప్పబడినవి.

"దుష్టస్యదండః, సుజనస్యపూజా,
 న్యాయేన కోశస్యచ సంప్రవృద్ధిః
 సుపక్షపాతోర్థిషు, రాజ్యరక్షా
 పంబైవయజ్ఞాః కథితాః నృపాణాం.”

దీనిని గోపరాజు విపులీకరించెను.

సీ. దుర్గరక్షణమును, దుష్టశిక్షణమును
         శిష్టపాలనమును సేయవలయు
    వర్ణధర్మములను వనములు గుళ్ళును
         జలజాకరంబులు నిలుపవలయుఁ
    గృషియు వాణిజ్యంబు గృహజీవధనములు
         నాయుర్ వ్యయంబులు నరయవలయు