పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

363


క.

మాతకడ నుండు పొ మ్మిదె
నీతండ్రిం బంపునాఁడ నిజమని [1]యతిదుః
ఖాతురుని మగుడ ననిపి మ
హీతలపతి రత్నగుణము లెరుఁగం దలఁచెన్.

203


ఆ.

ఇతనితండ్రి యున్నయెడకు నిప్పుడ యేగ
వలయు నతనిఁ బ్రోవవలయు ననుచు
రత్నసిద్ధి నంబరంబునఁ జుల్కనై
యర్కు మాడ్కి విక్రమార్కుఁ డేగె.

204


క.

అవ్విప్రు జేరి తెలియఁగ
నెవ్వఁడ వీ వనుఁడు నాతఁ డిట్లనియె ధనం
బెవ్వెంట లేక బ్రతుకుట
నెవ్వ యనుచు నింటితరులు నీఁగినవాఁడన్.

205


ఉ.

కాశ్యపిలోఁ బ్రసిద్ధమగు కంచిని నుండుదు విష్ణుశర్ముఁడం
గశ్యపగోత్రజాతుఁడ వికార విదూరమనస్కుఁడన్ జగ
ద్వశ్యకళావిశారదుఁడ దైవము చెయ్ది దరిద్రభావనా
కార్యము నొంది భార్య గడుఁ గష్టపుఁబల్కులు వల్క నోర్చితిన్.

206


క.

పడఁ గుక్కి లేదు నేలం
బడి పొరలఁగ [2]రొండలూఁడఁ బడితిని దల దా
జడగట్టెఁ గట్టఁ గోకయుఁ
గుడువం గూడును నెఱుంగఁ గుందుట దక్కన్.

207


సీ.

కుండలముందఱఁ[3] గూర్చుండి పడుచులు
        [4]గంజికి నేడ్చుచుఁ గదలలేరు

  1. యాయ్యన్ ద్యోతతకుని మగుడ ననిపి
  2. లొండులూడ, కన్ను లూడఁబడవెండ్రుకలు
  3. గుంటలముందఱ
  4. గంజి కేడ్చుచునది గానలేరు