పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

355


లోనం దెకతెక నుడుకం
గా నద్భుతమైన మడుఁగుఁ గని వెరఁగందెన్.

161


క.

పిట్టలు దివిఁ బాఱఁగ నా
కట్టావుల నెఱక నెల్లఁ గమరిన నచటన్
మట్టుపడి కూలుఁ దొడిమల
ప ట్టూడినయట్టి మేడిపండులభంగిన్.

162


ఆ.

అట్లు ఘోరమైన యయ్యుష్ణతీర్థంబు
చేర వెఱచి శిశిరవారిలోన
గెలన జలక మాడి వెలి కేగి యట గుడి
లోన నున్నశివునిఁ గానఁబోయి.

163


వ.

అద్దేవు నుచితోపచారంబుల నారాధించి యచట నొకరాత్రి గడపం గడంగి యుండె.

164


క.

ఆయెడ నాకాశంబున
నాయుష్ణాంబువుల యాపు లంటినఁ దప్తుం
డై యపరాంబుధి మునుఁగం
బోయెనొకో యీతఁ డన నభోమణి గ్రుంకెన్.

165


మ.

చదలం జుక్కలు పిక్కటిల్లగఁ దమస్సందోహము ల్బూమిఖా
గదిగంతంబుల నిండ రేయి నిగుడంగా నుష్ణతీర్థంబులో
నుదకం బుబ్బఁగ గొబ్బున న్వెడలి సాంగోపాంగసంగీతులం[1]
జదురాండ్రౌ నెనమండ్రు వచ్చి రట కాసర్వేశ్వరుం గొల్వఁగన్.

166


ఉ.

మోహనదివ్యమూర్తు లగుముద్దియ లాశశిమౌళికి న్మహో
త్సాహముతోడ హేమజలజంబులఁ బూజ లొనర్చి నాట్యస

  1. సంగీతలై