పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

353

అష్టమాశ్వాసము


వ.

అర్చన లిచ్చి తనఫాలంబునఁ గేలుదోయి గీలించి.

151


సీ.

పెద్దమెకముతోలు నిద్దంబుగాఁ గట్టి
        గాలిగ్రోలెడుసొమ్ము లీలఁ దాల్చి
చలికొండకూఁతుకై సామేన నిమ్మిడి
        చదలేఱు నెలయును జడలఁ జెరివి
యేనికమోముతో నెలుకనెక్కిన చిన్ని
        బొజ్జపాపఁడు నీదుపజ్జ నడువ
ముజ్జోడుమొగముల ముద్దులకొమరుండు
        పురిగలపులుఁగుపై నరుగుదేర


ఆ.

వెన్నుఁడును నలువయును బల్వేలుపులును
గొలువ [1]గుబ్బలికొమ్ములగుజ్జు నెక్కి
కలిమికొండకు నేతెంచి నిలిచి తనుచు
వింటి ముక్కంటి నినుఁ గనుఁగొంటి మంటి.

152


క.

అనుచు ననేకవిధంబులం
దననేర్చినకొలఁది నతఁడు తప్పనిభక్తిన్
వినుతించి పాపముల వీ
డ్కొని మగిడెం జిత్తశుద్ధి కొనసాఁగంగన్.

153


ఉ.

ఆదెసనుండి సర్వజగదాశ్రయు వేదపురాణవేద్యుఁ బ్ర
హ్లాదమనోవిధేయు నసురాంతకు శ్రీ నరసింహమూర్తిఁ గా
కోదరరాజతల్పుని నహోబలనాథునిఁ జూడనేగి త
త్పాదసరోరుహంబులకు భ క్తిఁ దగం బ్రణమిల్లి ధన్యుఁడై.

154


చ.

హరిహరసేవనాసుమతు లైన జను ల్విలసింప సంపదా
కరమగుసొంపుపెంపు గల కన్నడభూమికి నేగి యొక్కభూ

  1. గద్దరికొమ్ముల