పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

సింహాసన ద్వాత్రింశిక


కలహకంటక యేల కలహంబు గైకొంటి
        వనుడుఁ బోట్లాడ వేడ్కయ్యె ననుడు
మఱి ఠావు లేదె యీమర్మ మేర్పడఁ జెప్పు
        మనపుడు వ్రేయుట యది నిజంబు
నామీసములసుగంధము విదిర్చికొనంగ
        నితఁడు నే నుండుట యెఱుఁగ వనిన


ఆ.

మాటమీఁద నదియె వ్రేటుగాఁ జేసితిఁ
బిఱికి వీఁడు బురుకపిట్టయంత
గాని లేఁడు వీనిఁ గైకొందునా నేను
జెండి పాఱవైతు భండనమున.

34


వ.

అని పలికినఁ గలహకంటకుం గోపించి తుచ్ఛపుంబలుకులు పలుకుదురె పగవాని ఘనతచేసినఁ దనదొడ్డతనం బెక్కుడగు నతని హీనంబుగాఁ బలికిన సరిపూనికెం దానును హీనుం డగు నింతియ కాదు విక్రమార్కుండును నంగాధిపతియును మిత్రులు వారికన్నులం బుట్టిన కొడుకులు మీలో జగడంబు వలవదు.

35


క.

మగతనము నెఱపఁ బూనియుఁ
బగ యేమియు లేనిచోటఁ [1]బరిమాళింపం
దగ దతనికి నది నీకును
దిగులువడ న్నిలువనాడఁ దగ దాతనితోన్.

36


గీ.

అనఁ గలహకంటకుం డను నల్ల నవ్వి
పంతమౌ మీరెఱుంగని పాడిగలదె
గుడికొలువుబంటు మల్లనికొలఁది పంత
మయ్యె నిచ్చట నదియెట్టు లంటిరేని.

37
  1. బగగలిపింపదగతని కేని నీకును