పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

సింహాసన ద్వాత్రింశిక


భావన పాడి సత్యపరిపాలన మే లుపకార మెయ్యెడన్
భావన కీర్తి యాయువు శుభంబు నిజాప్తులు ధాత్రిలోపలన్[1].

208


క.

జాణ “లనిత్యాని శరీ
రాణి” యనుచుఁ దెలిపి చెప్పరా[2] భువినాత్మ
ప్రాణంబు లిచ్చి యార్త
త్రాణం బొనరింపవలయు తత్త్వజ్ఞులకున్[3].

209


తే.

నీవు లేవేని నొరులకుఁ గావవశమె
ధన్య నీవు బ్రదికిన నీతల్లి బ్రదుకు
నదియు కారణముగ వైరి కడ్డపడుదు
నీవు గోరిన యట్ల యీనెలఁతఁ గాతు.

210


ఆ.

అనుచు వధ్యచిహ్నమైన రక్తాంశుక
మడిగి మ్రొక్కినంత నతని నిల్పి
యేల ఖేచరేంద్ర యీదివ్యదేహంబుఁ
బాముకొఱకు విడువఁ బాడియవునె.

211


క.

క్షోణీమండలమునఁ గల
ప్రాణుల కెడరైన నడ్డపడుచుఁ దదీయ
త్రాణం బొనరించుచు నీ
ప్రాణంబులతోడఁ గీర్తిఁ బడయందగదే.

212


ఆ.

శంఖధవళ మైన శంఖపాలకులంబు
శంఖచూడు చేతఁ జాలఁ గందె
ననఁగ మీఁదఁ బుట్టు నపకీర్తి నాకది
చావు గాదె బ్రదుకుత్రోవ యేది.

213
  1. చా వపకీర్తి యశంబు నిజాప్తులు హీనజంతువుల్
  2. యుండరా
  3. ధర్మజ్ఞులకున్