పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

219


న్విని చిరజీవి పల్కె నరవిందభవుం డలికంబునందు వ్రా
సినయది తప్పునే పరులచేతఁ జరాచరభూతకోటికిన్.

79


క.

ఈ క్రమమునఁ బలుకఁగ విని
విక్రమభూషణుఁడు బాలవి ప్రత్రాణా
పక్రమమున నిద్రింపక
శుశ్రోదయవేళ కెదురు చూచుచు నుండెన్.

80


ఆ.

అంత భార్గవోదయంబైన వెలుఁగునం
దెరువు గానవచ్చు తెఱఁ గెఱింగి
కదలె వింధ్యగిరికి గండభేరుండాది
ఘోర మైనయడవిఁ గొంకులేక.

81


చ.

జలజల మంచునీ రొలుకఁ జల్లనిగాడ్పులు వీవఁ దారక
ల్మలమల మగ్గఁ జీఁకటి క్రమంబున డిగ్గ విహంగసంఘము
ల్మలకలం బల్కఁ దూర్పున వికాసము కెంపునఁ గూడియాడఁగా
బలబలఁ దెల్లవాఱె జనపాలకుఁ డేఁగువనాంతరంబునన్.

82


క.

ఒకసారె యేడుతేజులు[1]
వికలాంగుఁడు సూతుఁ డనిలవీథి తెరువుగా
నొకరథమునఁ ద్రిభువనములు
నొకనాఁటనె తిరుగునాతఁ డుదయము సేసెన్.

83


క.

ఆపర్వత మెక్కుచు గజ
రూపంబగు తిమిర మణఁచి లోహితకాంతి
వ్యాపితకరనఖరుండై
దీపించె మృగేంద్రుకరణి దినమణి కణఁకన్.

84
  1. ఒకతేజి కేడుపేరులు