పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

217


ఉ.

నావుడుఁ జూచి యతఁడు మనంబు యథాస్థితి నిల్పి యిట్లను
న్వేవురు బాంధవు ల్గలుగ వేదనఁ బొందఁగ నాకు నేల మీ
కీవిధిచొ ప్పెఱుంగఁ దగునేని వినుం డిఁక వింధ్యకందర
గ్రావముఁ జెంది యుండె నొకరక్కసుఁ డక్కడ నిక్కువంబుగన్.

68


శా.

ఆమాంసాగనుఁ డుక్కు పిక్కటిలఁగా నాత్మాంతికద్వాదశ
గ్రామాంకస్థుల నెల్లవారలఁ దినంగా నందఱు న్భీతి మై
స్తోమం బై చని సాగి మొక్క యొకమర్త్యు న్నిత్యము న్నీ బహి
ర్భూమి న్నిల్పెద మారగింపుము నవాపూపాదియుక్తంబుగన్.

69


మ.

అని సంప్రార్థన చేసి యేఁగి నిజమర్యాదావిధిం బ్రాప్తుఁ డౌ
మనుజుం గమ్మనిపిండివంటలును సన్మానంబుతోఁ దెచ్చి య
ప్పనసేయం గని యార్చుచు న్వెడలి వ్యాపాదించి[1] తృప్తాస్థగాఁ
దినుచుండుం దనుజుండు యత్నమునఁ బత్నీయుక్తుఁడై నిచ్చలున్.

70


వ.

ఇ ట్లనుదినంబును నరబలి జరగు నెల్లిటిదినంబున.

71


క.

మన్మిత్రుఁ డైన యొక్కద్వి
జన్మకుమారకుని వరుస చనుదెంగిన దే
తన్మూలము నాశోకము
సన్మార్గికిఁ గలియుగమున సౌఖ్యము గలదే.

72


మ.

అనిన న్విస్మయ మంది మేము ఖగవర్యా నీకు నవ్విప్రబా
లునకుం జుట్టఱికంబు కీలుం జెప్పుమా నావుడున్
వినరయ్యా యుపకారహీనుఁడ భయావిష్ణుండ నిర్భాగ్యజీ
వనుఁడం జెప్పెద దీని కారణము మీవాలాయపుంబల్కులన్.

73
  1. యార్భాటించి