పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 165

న్విన్నంతనె పఱతెంచెడు
మన్నీలన నపుడ యిరులుమన్నీ లెసఁగెన్. 98

[1]*క. లోకమున విగతదృష్టి వి
వేకంబునఁ జక్రవాకవిరహానలధూ
మాకారంబున జనములు
చీకాకుపడంగ దెసల జీకటి గప్పెన్. 99

గీ. అర్కుఁ డేఁగిన గాలాభ్రలీలఁ
దమము గప్పిన యెడ వియత్పథము దోఁచె
వరుస దప్పక దావపావకము సోఁకి
చనినపిమ్మట ఘనతృణస్థలము కరణి. 10

క. నేలయు నింగియు నిండగ
వాలుచు దళమైన చీఁకువాలేచినఁ ద
త్కాలంబున జన మొప్పెను
నీలసలిలమునను గడవ నించినమాడ్కిన్. 101

సీ. యమునాజలానీల మౌ చిమ్మచీకటి
పెల్లున జగమెల్ల నల్లనైన
దిగినఁ దప్పెద మని యగజతోడను శూలి
తనవెండికొండపైఁ దలఁకుచుండ
నీదెస మఱి గానరా దని హరి లక్ష్మి
దోయిగా నమృతాబ్దిఁ బాయకుండ
దీనఁ బాసినఁ గానలే నని వాణి తో
డ్పడ బ్రహ్మ వెలిదమ్మి వెడలకుండఁ

  1. ఈ పద్యము మొదలు **వఱకు నొకప్రతిలోనే కలవు.